బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఏర్పాటు

బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఏర్పాటు

హైదరాబాద్‌, వెలుగు: సమాజంలోని వెనుకబడిన వర్గాలకు చెందిన వారు  పారిశ్రామికవేత్తలుగా ఎదగడంలో సాయపడేందుకు  బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (బిక్కీ) ని కొంత మంది యంగ్ ఎంటర్‌‌ప్రెనూర్లు శనివారం  ఏర్పాటు చేశారు.  సీనియర్ జర్నలిస్ట్ చేరాల నారాయణ అధ్యక్షతన ఈ సంస్థ ఏర్పడింది. ఈ ఈవెంట్‌కు సీనియర్ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  

సమాజంలో ఆర్థిక స్వేచ్చ లేని, ఆర్థిక సమానత్వానికి దూరంగా ఉన్నవారిని ఎంటర్‌‌ప్రెనూర్లుగా తీర్చిదిద్దడమే బిక్కీ లక్ష్యమని నారాయణ అన్నారు.  ప్రభుత్వ సబ్సిడీలు, లోన్‌లు, రాయితీలను ఎంటర్‌‌ప్రెనూర్లు వాడుకొవాలని నరహరి పేర్కొన్నారు.