నేడే చూడండి :సెప్టెంబ‌ర్ 2న విడుద‌ల కానున్న ప్ర‌ముఖులు తెర‌వెనుక భాగోతాలు

V6 Velugu Posted on Aug 25, 2020

బిజినెస్ మ్యాగ్నెట్స్ గా పేరు ప్ర‌ఖ్యాత‌లు గ‌డించి ఆర్ధిక నేరాల‌కు పాల్ప‌డిన ప్ర‌ముఖుల తెర‌వెనుక భాగోతాల్ని బ‌య‌ట‌పెట్టేందుకు ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఓ డాక్యుమెంట‌రీని తయారు చేస్తోంది. ఆ డాక్యుమెంట‌రీ ట్ర‌యిల‌ర్ ను నెట్ ఫ్లిక్స్ విడుద‌ల చేసింది. ప్ర‌స్తుతం ట్ర‌యల‌ర్ నెటిజ‌న్ల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంది.

విజ‌య్ మాల్యా, సుబ్ర‌తారాయ్, నీర‌వ్ మోడీ మ‌రియు స‌త్యం కంప్యూట‌ర్స్ రామ‌లింగ‌రాజులు దేశంలో ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌లుగా ఎలా ఎదిగారు..? విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో కాంపిటీట‌ర్ల‌కు ఎలా చెక్ పెట్ట‌గ‌లిగారు…? ఆర్ధిక నేరాల‌కు ఏ విధంగా పాల్ప‌డ్డారు..? అనే అంశాల్ని ప్ర‌స్తావిస్తూ ఆయా సంద‌ర్భాల్లో వారు మాట్లాడిన వీడియో క్లిప్ ల‌ను యాడ్ చేస్తూ బ్యాడ్ బాయ్ బిలీనియ‌ర్స్ పేరుతో సెప్టెంబ‌ర్ 2న నెట్ ఫ్లిక్స్ విడుద‌ల చేయ‌నుంది.

ప్ర‌స్తుతం బ్యాడ్ బాయ్ బిలీనియ‌ర్స్ పేరుతో విడుద‌లైన ట్ర‌య‌లర్ నెటిజ‌న్ల‌ను విప‌తీరంగా ఆక‌ట్టుకుంటుంది.

Tagged Bad Boy Billionaires India trailer, controversial cases of Vijay Mallya, Nirav Modi

Latest Videos

Subscribe Now

More News