ఆఫ్ఘనిస్తాన్ కు ట్రంప్ బెదిరింపులు.. బాగ్రామ్ ఎయిర్ బేస్ తిరిగివ్వండి.. లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయి

ఆఫ్ఘనిస్తాన్ కు ట్రంప్ బెదిరింపులు.. బాగ్రామ్ ఎయిర్ బేస్ తిరిగివ్వండి.. లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయి

ఆఫ్ఘనిస్తాన్ పై బెదిరింపులు దిగారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆఫ్ఝనిస్తాన్ లోని బాగ్రామ్ ఎయిర్ బేస్ ను తమకు అప్పిగించాలని లేకుండా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ బెదిరించారు. 

ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ నుంచి 64 కి.మీ దూరంలో ఉన్న విశాలమైన వైమానిక స్థావరాన్ని తిరిగి ఇవ్వాలన్న ట్రంప్ పిలుపును తాలిబన్ ప్రభుత్వం తిరస్కరించిన ఒక రోజు తర్వాత  ట్రంప్ నుంచి నుంచి ఈ బెదిరింపులు వచ్చాయి. 

ఆఫ్ఘనిస్తాన్ లోని బాగ్రామ్ ఎయిర్ బేస్ ను మేం నిర్మించాం..దానికి మాకు అప్పగించాలి లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్రూత్ లో రాశారు. సెప్టెంబర్ 11, 2001లో న్యూయార్క్,వాషింగ్టన్‌ లపై అల్-ఖైదా దాడులు జరిపిన తర్వాత ఆప్ఘనిస్తాన్ లోని బాగ్రామ్ ఎయిర్ పోర్టు  ప్రధాన స్థావరంగా US దళాలకు ఉగ్రవాదంపై యుద్దాన్ని కొనసాగించాయి.  

ఉగ్రవాదంపై యుద్ధం సమయంలో వేలాది మందిని బాగ్రామ్ లో జైలులో ఉంచాయి US దళాలు. వారిలో చాలామంది దారుణ హింసకు గురయ్యారు. ఆఫ్ఘన్ ప్రభుత్వం తర్వాత అమెరికా దళాలు వెళ్లిపోయిన తర్వాత ఈ ప్రాంతాన్ని తాలిబన్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 

ఇటీవల ఆప్ఘనిస్తాన్ చైనాకు సన్నిహితంగా ఉండటం గమనించిన ట్రంప్.. తిరిగి బాగ్రామ్ ఎయిర్ బేస్ ను తమకు అప్పగించాలని గురువారం బ్రిటన్ పర్యటనలో ఆప్ఘనిస్తాన్ ను కోరారు. అయితే తాలిబన్ ప్రభుత్వం ట్రంప్  మాటలను పట్టించుకోకపోవడంతో తాజాగా తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్రూత్ వేదికగా ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వంపై బెదిరింపులకు దిగారు. 

ట్రంప్ కోరికను ఆఫ్ఘన్ ప్రభుత్వం తిరస్కరించింది. అమెరికాను తిరిగి తమ భూభాగంలో అడుగు పెట్టనివ్వమని స్పష్టం చేసింది.