1,116 కొబ్బరికాయలు కొట్టిన బడంగ్ పేట మేయర్.. ఎందుకంటే

1,116 కొబ్బరికాయలు కొట్టిన బడంగ్ పేట మేయర్.. ఎందుకంటే

ఎల్బీ నగర్, వెలుగు: రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ బడంగ్ పేట మేయర్ చిగిరింత పారిజాత బుధవారం స్థానిక శివనారాయణపురంలోని ఉమామహేశ్వరస్వామి వారికి 1,116 కొబ్బరికాయలు కొట్టారు. పలువురు కాంగ్రెస్ లీడర్లతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. రాహుల్​యాత్రతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభం వచ్చేలా చూడాలని స్వామివారిని కోరుకున్నట్లు పారిజాత తెలిపారు. టీపీసీసీ కార్యదర్శి వై.అమరేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి బంగారి బాబు, కార్పొరేటర్లు ప్రభాకర్​రెడ్డి, పెద్దబావి సుదర్శన్ రెడ్డి, రాళ్లగూడెం సంతోషి శ్రీనివాస్ రెడ్డి, బండారి మనోహర్, నేనావత్ బాలు నాయక్, రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకుడు బి.జంగయ్య పాల్గొన్నారు.