
న్యూఢిల్లీ : ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో టైటిల్ ఫేవరెట్ హెచ్‌ఎస్ ప్రణయ్, యంగ్‌స్టర్ ప్రియాన్షు రజావత్ శుభారంభం చేశారు. మంగళవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో 9వ ర్యాంకర్ 21–6, 21–9తో చౌ టైన్ చెన్ (చైనీస్ తైపీ)ని వరుస గేమ్స్‌లో ఓడించాడు. మరో మ్యాచ్‌లో 30వ ర్యాంకర్ రజావత్ 16–21, 21–16, 21–13తో 19వ ర్యాంకర్ లక్ష్యసేన్‌ను ఓడించి సంచలనం సృష్టించాడు. రెండో రౌండ్‌లో ప్రణయ్‌తో రజావత్ పోటీపడనున్నాడు. ఇంకో మ్యాచ్‌లో క్వాలిఫయర్ కిరణ్ జార్జ్ 12–21, 15–21తో వాంగ్ జు వీ (తైపీ) చేతిలో ఓడిపోయాడు. విమెన్స్ డబుల్స్‌లో రుతుపర్ణ పండా–శ్వేతపర్ణ పండా, పుల్లెల గాయత్రి–ట్రీసా జాలీ జోడీలు తొలి రౌండ్‌లోనే ఓడి ఇంటిదారి పట్టాయి.