బ్యాడ్మింటన్‌‌‌‌ ఆసియా జూనియర్‌‌‌‌ చాంపియన్ షిప్ లో ఇండియా శుభారంభం

 బ్యాడ్మింటన్‌‌‌‌ ఆసియా జూనియర్‌‌‌‌ చాంపియన్ షిప్ లో ఇండియా శుభారంభం

సోలో (ఇండోనేషియా): బ్యాడ్మింటన్‌‌‌‌ ఆసియా జూనియర్‌‌‌‌ మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ టీమ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో ఇండియా శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన గ్రూప్‌‌‌‌–డి మ్యాచ్‌‌‌‌లో ఇండియా 110–69తో శ్రీలంకపై గెలిచింది. మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ డబుల్స్‌‌‌‌ జోడీ విష్ణు కోడె–రేషిక 11–5తో కెనెత్‌‌‌‌ అరుగ్గోడ–ఇసురి అటనాయకేపై నెగ్గారు. మరో మ్యాచ్‌‌‌‌లో గాయత్రి–మన్సా రావత్‌‌‌‌ 22–14తో అటనాయకే–సితుమి డి సిల్వను ఓడించగా, జూనియర్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ నంబర్‌‌‌‌వన్‌‌‌‌ తన్వి శర్మ 33–21తో సితులి రణసింఘేపై గెలిచింది. 

శనివారం జరిగే రెండో మ్యాచ్‌‌‌‌లో ఇండియా.. యూఏఈతో తలపడుతుంది. ఆదివారం హాంకాంగ్‌‌‌‌ను ఎదుర్కొంటుంది. ఈ ఫలితాల తర్వాత గ్రూప్‌‌‌‌లో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ ఎవరిదనేది తేలుతుంది. 2011 టోర్నీలో ఇండియా బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌ సాధించింది. గతేడాది క్వార్టర్స్‌‌‌‌లో ఇండియా 2–3తో మలేసియా చేతిలో ఓడింది. ఈ టోర్నీలో మొత్తం 17 జట్లు పాల్గొంటున్నాయి. నాలుగు గ్రూప్‌‌‌‌ల్లో టాప్‌‌‌‌–2 టీమ్స్‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌కు అర్హత సాధిస్తాయి. సెమీస్‌‌‌‌లో ఓడిన రెండు జట్లకు బ్రాంజ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌ ఇస్తారు.