బద్రీనాథ్ ఆలయం తెరిచేందుకు ముహుర్తం ఖరారు 

బద్రీనాథ్ ఆలయం తెరిచేందుకు ముహుర్తం ఖరారు 

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరిచేందుకు ముహూర్తం ఖరారైంది. చార్ధామ్లలో ఒకటైన ఈ ఆలయంలోకి మే 8నుంచి భక్తులను అనుమతించనున్నారు. ఏటా శీతాకాలంలో ఆలయం చుట్టూ మంచు పేరుకుపోతుంది. ఈ నేపథ్యంలో చార్ధామ్ ట్రస్టు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆరు నెలల పాటు గుడిని మూసివేస్తుంది. గతేడాది నవంబర్ 20న ఆలయ ద్వారాలు మూసివేయగా.. ఈ ఏడాది మే 8 ఉదయం 6.15గంటలకు తిరిగి తెరిచేందుకు ముహూర్తం ఖరారు చేశారు. వసంత పంచమిని పురస్కరించుకుని ఈ విషయాన్ని ప్రకటించారు. గతేడాది 1,97,056 మంది భక్తులు బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించారు.
 

మరిన్ని వార్తల కోసం..

ప్రపంచస్థాయి పరిశోధనలకు భారత్ వేదిక

ప్రధాని పర్యటనకు కేసీఆర్ దూరం