Bahumukham Trailer: నువ్వు పెయిన్ కిల్లర్వి కాదు,సైకో కిల్లర్వి..విలక్షణమైన బహుముఖం

Bahumukham Trailer: నువ్వు పెయిన్ కిల్లర్వి కాదు,సైకో కిల్లర్వి..విలక్షణమైన బహుముఖం

హర్షివ్ కార్తీక్ ప్రధాన పాత్రలో నటిస్తూ,దర్శకనిర్మాతగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘బహుముఖం’(Bahumukham). గుడ్, బ్యాడ్  అండ్ ది యాక్టర్ అనేది ట్యాగ్‌‌లైన్‌‌. అరవింద్ రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవరిస్తున్నారు. సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ గా రాబోతుంది. 

లేటెస్ట్గా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. హీరో హర్షివ్ ఓ వైపు శివుడి తరహాలో సుదుటిపై విభూతి, నీలం రంగులో కనిపిస్తుండగా, మరోవైపు స్టైలిష్‌‌ లుక్‌‌లో ఉన్నాడు. కన్నీళ్లు ఓ వైపు, ఆనందం మరోవైపు కనిపిస్తున్నాయి. రెండు చేతులకు సంకెళ్లు వేశారు.ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది.

చిన్నప్పటి నుంచీ యాక్టర్ అవ్వాలని కలలు కనే ఓ యువకుడు..తన లక్ష్యం నిజం చేసుకోవడం కోసం తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైనా అవమానాలను ట్రైలర్ లో చక్కగా చూపించారు.

ఆడిషన్స్ లో 'నువ్వు పెయిన్ కిల్లర్ వి కాదమ్మా, సైకో కిల్లర్ వి' అనడం..'ఎన్ని రోజులని ఇలా నిజాన్ని దాస్తావ్?' అని అందరు ప్రశ్నించడాన్ని బట్టి చూస్తే, అతను ఏదో రహస్యాన్ని దాచిపెడుతున్నట్లుగా ట్రైలర్ లో తెలుస్తోంది.

ఇక ట్రైలర్ చివర్లో 'ఇది హరికథ బుర్రకథ కాదు..ఇది నిజమైన కథ, జరిగిన కథ..నా కథ' అంటూ స్టేజ్ మీద హీరో చేసే పెర్ఫార్మెన్స్ ట్రైలర్ లో ఆసక్తికరంగా కనిపిస్తోంది. మొత్తానికి ఇదొక విలక్షణమైన సినిమా అని ట్రైలర్ లో చూపించారు మేకర్స్.మరి ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి అనుభూతిని ఇస్తుందో చూడాలి. 

అట్లాంటా, మాకాన్, కాంటన్, జార్జియా, యుఎస్ఏ పరిసర ప్రాంతాలలో ఈ సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ షూటింగ్ చేశారు. స్వర్ణిమా సింగ్, మరియా మార్టినోవా ఇతర పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాకు ల్యూక్ ఫ్లెచర్ సినిమాటోగ్రాఫర్ కాగా, ఫణి కళ్యాణ్ సంగీతం, శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఏప్రిల్ 5న థియేటర్లలో రిలీజ్ చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.