అదరగొట్టిన బజాజ్ ఫైనాన్స్

అదరగొట్టిన బజాజ్ ఫైనాన్స్

న్యూఢిల్లీ : బజాజ్ ఫైనాన్స్ క్వార్టర్ ఫలితాల్లో అదరగొట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌‌‌‌తో ముగిసిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో అత్యధికంగా రూ.1,195 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాలను ఆర్జించినట్టు ప్రకటించింది. ఇప్పటి వరకు కంపెనీకి ఇదే అత్యధిక క్వార్టర్ లాభాలు. గతేడాదితో పోలిస్తే ఈ లాభాలు 43 శాతం పెరిగాయి. కంపెనీ 2018–19 ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో రూ.836 కోట్ల నికర లాభాలను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కంపెనీ కన్సాలిడేటెడ్ ఇన్‌‌‌‌కమ్ 47 శాతం పెరిగి రూ.5,808 కోట్లుగా రికార్డైనట్టు బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ తన ప్రకటనలో తెలిపింది. గతేడాది ఇవి రూ.3,938 కోట్లుగా ఉన్నట్టు చెప్పింది. స్టాండలోన్ బేసిస్‌‌‌‌లో, ఈ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో కంపెనీ నికర లాభాలు 35 శాతం పెరిగి రూ.1,125 కోట్లుగా ఉన్నాయి. ఇన్‌‌‌‌కమ్ 40 శాతం పెరిగి రూ.5,305 కోట్లుగా రికార్డయినట్టు కంపెనీ పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం 43 శాతం పెరిగి రూ.3,695 కోట్లకు చేరుకుంది. కంపెనీ కన్సాలిడేటెడ్ అసెట్ అండర్ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ జూన్‌‌‌‌తో ముగిసిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో 41 శాతం పెరిగి రూ.1.29 లక్షల కోట్లుగా ఉన్నట్టు తెలిసింది. గతేడాది జూన్‌‌‌‌తో ముగిసిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో ఇవి రూ.91,287 కోట్లుగా ఉన్నాయి. కంపెనీ కన్సాలిడేటెడ్ ఫలితాల్లో సబ్సిడరీలు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్సియల్ సెక్యురిటీస్ లిమిటెడ్ ఫలితాలు కూడా కలిసి ఉన్నాయి. ఫలితాల ప్రకటన నేపథ్యంలో బజాజ్ ఫైనాన్స్ షేర్లు 3.19 శాతం తగ్గి రూ.3,070.30 వద్ద ట్రేడయ్యాయి.

బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌‌ లాభాలు రూ.845 కోట్లు

బజాజ్‌ గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌‌ ఈ ఏడాది జూన్‌ తో ముగిసిన తొలి క్వార్టర్‌ కుగానూ రూ.845 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది.
2018 క్యూ 1లాభం రూ.825 కోట్లతో పోలిస్తే ఈసారి ఇది రెండు శాతం పెరిగింది. మొత్తం ఆదాయాలు 40 శాతం పెరిగి రూ.8,771 కోట్ల నుంచి రూ.12,272 కోట్లకు చేరా యి. ‘‘గత ఏడాది ఐఎల్‌ ఎఫ్‌ ఎస్‌ దివాలా తీసిన తరువాత లిక్విడిటీకి ఇబ్బం దులు ఎదురవుతున్నా యి. పటిష్ట బ్యా లన్స్‌‌ షీట్‌‌ ఉన్న కంపెనీలకే బ్యాంకులు అప్పులు ఇస్తున్నాయి’’ అని బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌‌ తెలిపింది. తమకు ఒక్క పైసా కూడా అప్పులేదని
ప్రకటించింది. గత క్యూ1లో మిగులు నిధులు విలువ రూ.660 కోట్లు కాగా, తాజా క్వార్టర్ ఇవి రూ.790 కోట్లకు చేరా యి. బజాజ్‌ ఫైనాన్స్‌‌లో
బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌‌కు, బజాజ్‌ ఎలియాం జ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌‌, బజాజ్‌ అలియాం జ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌‌కు వాటాలు ఉన్నా యి. బజాజ్‌ హౌసింగ్‌
ఫైనాన్స్ కంపెనీ మాత్రం బజాజ్‌ ఫైనాన్స్‌‌కు సబ్సిడరీ. ఫెని తుఫాను వల్ల ఇన్సూరెన్స్‌‌ వ్యాపారాలకు బాగా నష్టం వచ్చింది. ఫలితాల నేపథ్యంలో
బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌‌ షేరు బీఎస్‌ ఈలో 3.92 శాతం నష్టపోయి రూ.6,783 వద్ద ముగిసింది.