న్యూఢిల్లీ: ఆసియా గేమ్స్‌లో పాల్గొనేందుకు ఇండియా స్టార్ రెజ్లర్లు బజ్‌రంగ్ పూనియా, వినేశ్ ఫోగట్‌కు డైరెక్ట్ ఎంట్రీ లభించింది. ఈ మేరకు ఐఓఏ రెజ్లింగ్ అడ్‌హక్ కమిటీ మంగళవారం నిర్ణయం తీసుకుంది. అయితే నేషనల్ చీఫ్ కోచ్‌ను సంప్రదించకుండా ఈ ఎంపిక జరగడంతో మిగతా రెజ్లర్లు, కోచ్‌లు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. మెన్స్ ఫ్రీస్టయిల్ 65 కేజీ, విమెన్స్ 53 కేజీల్లో ఇప్పటికే రెజ్లర్లను ఎంపిక చేశామని, మిగతా ఆరు వెయిట్ కేటగిరీల్లో ట్రయల్స్ జరుగుతాయని అడ్‌హక్ కమిటీ పేర్కొంది. బజ్‌రంగ్, వినేశ్‌ను ట్రయల్స్ నుంచి మినహాయించామని ప్యానెల్ మెంబర్అశోక్ తెలిపారు. సెప్టెంబర్ 23 నుంచి హాంగ్‌జౌలో ఆసియా గేమ్స్ జరగనున్నాయి.
