రెడీమేడ్​ సకినాలు, గారెలకు మస్తు గిరాకీ

రెడీమేడ్​ సకినాలు, గారెలకు మస్తు గిరాకీ

హైదరాబాద్, వెలుగు: సంక్రాంతి అంటేనే యాదికొచ్చేవి.. సకినాలు, గారెలు, అరిసెలు, మురుకులు. పండుగ పూట  ప్రతి ఇంట్లో ఇవి ఉండాల్సిందే. సంక్రాంతికి ముందు నుంచి పండుగెళ్లినంక వారం పది రోజుల దాకా పొద్దున చాయ్​లకైనా.. ఈవినింగ్​ స్నాక్స్​కైనా.. వీటిని ఇంటిల్లిపాది కరకరలాడించేస్తుంటారు. ఒకప్పుడు పల్లెల్లోనే కాదు.. సిటీల్లో కూడా చుట్టుపక్కల ఇండ్లల్లో ఉండే మహిళలంతా కలిసి ఒకరి ఇంటి తర్వాత ఇంకొకరి ఇంట్లో  ఈ వంటకాలను తయారు చేసుకునేవాళ్లు. కానీ, ఇప్పుడు సిటీ లైఫ్​లో క్షణం తీరిక లేని వర్క్‌ ప్రెజర్‌, పలకరింపులు కూడా సరిగ్గా లేని  ఇరుగు పొరుగుతో.. అసలు ఆ పిండి వంటలు ఎట్ల చేస్తరో కూడా తెలియక రెడీమేడ్​ పిండి వంటకాలను జనం ఆశ్రయిస్తున్నారు. దీంతో వాటిని తయారు చేసి అమ్మే స్టోర్లకు మస్తు గిరాకీ వస్తున్నది. హైదరాబాద్​ సహా ఇతర టౌన్లలోనూ గల్లీ గల్లీకి పిండివంటల దుకాణాలు వెలుస్తున్నాయి.  

డోర్​ డెలివరీ

సంక్రాంతి, ఉగాది, హోళీ, దసరా.. పండుగ ఏదైనా చాలా పల్లెల్లో ఇప్పటికీ సకినాలు, అరిసెలు, గారెలు, గరిజెలు, పోలెలు (బక్షాలు), చేగోళ్లు వంటి పిండి వంటలు చేసుకుంటుండగా.. చిన్నపాటి టౌన్‌లు, ప్రధాన పట్టణాల్లో మాత్రం ఇంట్లో చేసుకోవడం తగ్గిపోయింది. స్టోర్స్​ మీదనే ఎక్కువమంది ఆధారపడుతున్నారు. జనం టెస్టుకు తగ్గట్టుగా స్టోర్స్​ వాళ్లు పిండి వంటలను తయారు చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం, రామగుండం, మంచిర్యాల సహా ఇతర పట్టణాల్లోని పిండి వంటల షాపులు కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇస్తే సకినాలు, గారెలు సహా ఇతర పిండి వంటలను ఇంటికే డోర్‌ డెలివరీ చేస్తున్నారు. సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్‌లో 15 రోజుల ముందు నుంచే ఆర్డర్‌ తీసుకొని తయారు చేసి అమ్ముతున్నారు.  మామూలు రోజుల్లో ఒక్కో పిండివంటల తయారీ స్టోర్‌లో 15 నుంచి 20 కిలోల పిండివంటలు మాత్రమే అమ్మితే.. ఇప్పుడు ఒక్కో స్టోర్‌లో 120 కిలోల వరకు అమ్ముతున్నారు.  ఇందులో 40 శాతం వరకు డోర్‌ డెలివరీ చేస్తున్నారు. ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే సుమారు మూడు వేల వరకు స్వగృహ ఫుడ్స్‌, తెలంగాణ పిండివంటల తయారీ స్టోర్లు ఉన్నాయని అంచనా. సకినాలు, గారెలు, మురుకులు, బెల్లం అప్పాలు, సున్నుండలు, నువ్వుల ఉండలు వంటి పిండి వంటలకు గిరాకీ ఎక్కువగా ఉందని పిండివంటల స్టోర్ ఓనర్ వనిత  చెప్పారు. 

రెట్టింపైన ఆర్డర్లు

రెడీమేడ్ పిండి వంటలకు ఏటా గిరాకీ  పెరుగుతున్నది. మామూలు రోజులతో పోలిస్తే ప్రస్తుతం పది రెట్లు ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నాయి. పిండి వంటలకు గిరాకీ బాగుంటుండటంతో చాలామంది దీన్నే జీవనోపాధిగా మలుచుకుంటున్నారు. సిటీ జీవితంలో ఇంట్లో పిండివంటలు తయారు చేసుకునేవాళ్లు తగ్గిపోయి ఆన్‌లైన్ ఆర్డర్లకు డిమాండ్ ఎక్కువైతున్నది. కస్టమర్ల నుంచి వస్తున్న రెస్పాన్స్ కి తగ్గట్టుగా ఆర్డర్ల మీద రెడీ చేసి డెలివరీ చేస్తున్నామని తయారీదారులు చెప్తున్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాలకు కూడా డెలివరీ చేస్తున్నామని అంటున్నారు.  మామూలు రోజులతో పోలిస్తే పండుగ సీజన్‌లో క్షణం తీరిక లేకుండా వంటలు చేస్తూనే ఉంటామని తెలంగాణ పిండివంటల స్టోర్ ఓనర్ యాదమ్మ అన్నారు. కొందరు తమ ఇండ్లలో వీటిని తయారు చేసి.. ట్రాలీ వెహికల్స్‌ లో పెట్టుకుని వివిధ ప్రాంతాలు తిరుగుతూ అమ్ముతున్నారు.

హైదరాబాద్​ సహా ఇతర టౌన్లలోనూ గల్లీ గల్లీకి పిండివంటల దుకాణాలు వెలుస్తున్నాయి.  సంక్రాంతి, ఉగాది, హోళీ, దసరా.. పండుగ ఏదైనా చాలా పల్లెల్లో ఇప్పటికీ సకినాలు, అరిసెలు, గారెలు, గరిజెలు, పోలెలు (బక్షాలు), చేగోళ్లు వంటి పిండి వంటలు చేసుకుంటుండగా.. చిన్నపాటి టౌన్‌‌‌‌లు, ప్రధాన పట్టణాల్లో మాత్రం ఇంట్లో చేసుకోవడం తగ్గిపోయింది. స్టోర్స్​ మీదనే ఎక్కువమంది ఆధారపడుతున్నారు. జనం టెస్టుకు తగ్గట్టుగా స్టోర్స్​ వాళ్లు పిండి వంటలను తయారు చేస్తున్నారు. హైదరాబాద్‌‌‌‌తో పాటు వరంగల్‌‌‌‌, కరీంనగర్‌‌‌‌, నిజామాబాద్‌‌‌‌, ఖమ్మం, రామగుండం, మంచిర్యాల సహా ఇతర పట్టణాల్లోని పిండి వంటల షాపులు కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఆర్డర్‌‌‌‌ ఇస్తే సకినాలు, గారెలు సహా ఇతర పిండి వంటలను ఇంటికే డోర్‌‌‌‌ డెలివరీ చేస్తున్నారు. సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్‌‌‌‌లో 15 రోజుల ముందు నుంచే ఆర్డర్‌‌‌‌ తీసుకొని తయారు చేసి అమ్ముతున్నారు.  మామూలు రోజుల్లో ఒక్కో పిండివంటల తయారీ స్టోర్‌‌‌‌లో 15 నుంచి 20 కిలోల పిండివంటలు మాత్రమే అమ్మితే.. ఇప్పుడు ఒక్కో స్టోర్‌‌‌‌లో 120 కిలోల వరకు అమ్ముతున్నారు.  ఇందులో 40 శాతం వరకు డోర్‌‌‌‌ డెలివరీ చేస్తున్నారు. ఒక్క గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌లోనే సుమారు మూడు వేల వరకు స్వగృహ ఫుడ్స్‌‌‌‌, తెలంగాణ పిండివంటల తయారీ స్టోర్లు ఉన్నాయని అంచనా. సకినాలు, గారెలు, మురుకులు, బెల్లం అప్పాలు, సున్నుండలు, నువ్వుల ఉండలు వంటి పిండి వంటలకు గిరాకీ ఎక్కువగా ఉందని పిండివంటల స్టోర్ ఓనర్ వనిత  చెప్పారు. 
 

ఎక్కువ ఆర్డర్లు వస్తున్నయ్​

కరోనా కారణంగా రెండేండ్లు పెద్దగా గిరాకీ లేదు. ఇప్పుడే చాలా బాగా జరుగుతున్నది.  సిటీతో పాటు విదేశాలకు పంపిస్తున్నాం. రెగ్యులర్ గా ఆర్డర్లు వస్తుంటాయి. కానీ ఈ టైంలో ఎక్కువగా ఉంటాయి. గ్యాప్ లేకుండా ఆర్డర్ కాల్స్ వస్తున్నాయి. సంక్రాంతి సాయంత్రం వరకు ఇలాగే ఉంటుంది. 
- చింతల అనిత, హైదరాబాద్​