
కంటెంట్ ఉన్న ప్రతి సినిమా పాన్ ఇండియా మూవీనే అని హీరో బాలకృష్ణ అన్నారు. శివరాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన 'వేద' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆయన చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. శివరాజ్ కుమార్ తనకు తమ్ముడు లాంటివాడన్నారు. వారసత్వాన్ని కాపాడటం చాలా పెద్ద బాధ్యతన్న బాలయ్య...దానిని కాపాడుతూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం మరింత కష్టమన్నారు. రాజ్ కుమార్ ఫ్యామిలీ ఎన్నో మంచి పనులు చేస్తుందని ఈ సందర్భంగా బాలయ్య గుర్తుచేశారు.
ఇండస్ట్రీ అంతా ఒక కుటుంబం లాంటిదని బాలయ్య అన్నారు. ఒక్కొక్కరి గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవవసరం లేదని చెప్పారు. ఈ సినిమా ద్వారా శివరాజ్ కుమార్ తన భార్య గీతను ప్రొడ్యూసర్గా పరిచయం చేయడం అభినందించదగ్గ విషయమని అన్నారు. ఆడవాళ్లు అన్ని రంగాల్లో ముందుండాలని బాలయ్య తెలిపారు.
హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన వేద చిత్రాన్నిశివరాజ్ కుమార్ తన సొంత బ్యానర్లోనే నిర్మించారు. గతేడాది డిసెంబర్ 23వ తేదీన కన్నడలో రిలీజైన ఈ సినిమా అక్కడ భారీ వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ సినిమాను ఫిబ్రవరి 9న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.