బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భగవంత్ కేసరి’. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో ఆయన రాహుల్ సంఘ్వి అనే విలన్‌గా నటిస్తున్నాడు.
తాజాగా తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. దీంతో ఆయన టీమ్ అందరికీ గుడ్ బై చెప్పారు. మళ్లీ కలుద్దాం అంటూ బాలకృష్ణ, అనిల్ రావిపూడితో దిగిన ఫొటోలను ట్వీట్ చేశారు. ఇదే ఫస్ట్ తెలుగు సినిమా కావడంతో మొదట నెర్వస్‌గా ఫీలయ్యానని, కానీ షూటింగ్ చాలా అద్భుతంగా జరిగిందని, పెద్దన్నయ్య బాలకృష్ణ సహకారం లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదని అర్జున్ రాంపాల్ అన్నారు.
షూటింగ్‌లో ఆయన నుంచి చాలా నేర్చుకున్నానన్న రాంపాల్.. టీమ్ అందరూ చాలా సహకరించారని చెప్పాడు. అక్టోబర్ 19న థియేటర్స్‌లో మళ్లీ కలుద్దాం అని అన్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కీలకపాత్ర పోషిస్తోంది. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.