
ఇద్దరి అల్లుళ్ల.. ముద్దుల మామయ్య హీరో నందమూరి బాలకృష్ణ. లేటెస్ట్గా బాలయ్య తన అల్లుళ్లతో కలిసివున్న ఓ బ్యూటిఫుల్ వీడియో ఇపుడు వైరల్ అవుతుంది. ఇటీవలే హైదరాబాద్‌లో మాజీ ఎంపీ, బంధువు కావూరి సాంబశివరావు షష్టిపూర్తి వేడుకకు బాలకృష్ణ, తన అల్లుళ్లతో కలిసి అటెండ్ అయ్యారు. ఈ వేడుకలో పెద్ద అల్లుడు నారా లోకేష్, చిన్నల్లుడు శ్రీ భరత్ మామ బాలకృష్ణతో సందడి చేశారు.ఇద్దరి అల్లుళ్లపై సరదాగా చేతులేసి, నవ్వులు కురిపించాడు బాలకృష్ణ.
అంతేకాకుండా తనదైన శైలిలో చిన్న అల్లుడిపై సరదా కామెంట్ చేసి ఆటపట్టించాడు. లోకేష్, భరత్ భుజాలపై చేతులు వేసి బాలకృష్ణ ఓ ఫోటో దిగాలని భావించాడు. అప్పుడు చిన్నల్లుడు భరత్ ఎత్తు ఎక్కువ ఉండటంతో.. 'నీ మీద చేయి వేయాలంటే ప్రాబ్లం.. పుష్ప లా అయిపోతా(భుజం వంగినట్టు). అందుకే ఇక్కడ వేశా (లోకేష్ భుజం మీద చేతులు వేస్తూ) అని సడెన్‌గా బాలయ్య అనడంతో లోకేష్, భరత్ నవ్వేశారు.
నీ మీద చేయి వేయాలంటే ప్రాబ్లం పుష్ప లా అయిపోతా...
— మన ప్రకాశం (@mana_Prakasam) June 22, 2025
ఇక్కడ వేశా...
అల్లుళ్ళ తో నందమూరి బాలయ్య... pic.twitter.com/YdhtZuiez6
ఇప్పుడీ ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బాలయ్య ఫ్యాన్స్ ఈ వీడియోని షేర్ చేస్తూ.. తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు. బాలయ్య ఎక్కడున్నా.. సింహమే.. 'అల్లుళ్ళతో బాలయ్య భలే మజాకా'.. బాలయ్య టైమింగ్ సూపర్ అని పోస్టులు పెడుతున్నారు.
ప్రస్తుతం బాలకృష్ణ ఇద్దరు అల్లుళ్ళు రాజకీయాల్లో కీలక పదవుల్లో ఉన్నారు. పెద్దల్లుడు నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రిగా.. చిన్నల్లుడు శ్రీభరత్ విశాఖపట్నం ఎంపీగా ఉన్నారు. వీరిద్దరూ అధికార కూటమిలోని ప్రధాన పార్టీ టీడీపీలోనే ఉండటం విశేషం
►ALSO READ | Allu Arjun AA22: ఐకాన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అల్లు అర్జున్-అట్లీ మూవీ కీలక అప్డేట్!
ఇకపోతే కావూరి సాంబశివరావు బాలకృష్ణ చిన్నల్లుడు MP శ్రీభరత్‌కు స్వయానా తాత అవుతారు. ఈ క్రమంలోనే, నారా, నందమూరి ఫ్యామిలీస్ కావూరి వివాహ వార్షికోత్సవ వేడుకలకు అటెండ్ అయ్యారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన ఈ వేడుకలకు ట్రెండు తెలుగు రాష్ట్రాల సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు.
మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు గారి 60 వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి నివాసంలో కావూరి సాంబశివరావు గారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది pic.twitter.com/YtvnrazRLQ
— Ponnam Prabhakar (@Ponnam_INC) June 22, 2025