
ప్రముఖ రియాలిటీ షో బిగ్బాస్సీజన్ 7(Bigg boss sesson 7) కోసం మేకర్స్ సన్నాహాలు మొదలుపెట్టేసారు. ఇప్పటికే ఈ షో కి ఎన్టీఆర్(Jr NTR ), నాగార్జున(Nagarjuna), నాని(Nani) వంటి హీరోలు హోస్ట్‌లుగా చేసిన విషయం తెలిసిందే. తాజాగా బాలకృష్ణ(Balakrishna) పేరు ఇందులో గట్టిగానే వినిపిస్తోంది.
ఇటీవల వచ్చిన సీజన్లు ప్రేక్షకుల ఆదరణ పొందడంలో విఫలమయ్యాయి. పార్టిసిపెంట్ల వివరాలు, ఎలిమినేట్ అయ్యేది.. వైల్డ్ కార్డు ఎంట్రీలు, విన్నర్ వంటి సమాచారం లీకులు రూపంలో ముందే బయటకు రావడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో ఈ షోపై ఆడియెన్స్‌కు ఇంట్రెస్ట్ పోయింది. ఈసారి మాత్రం అలాంటివేమీ లేకుండా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మరి ఈ సీజన్ ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.