బాలయ్యకు పర్ఫెక్ట్ టైటిల్.. ఇక రికార్డ్స్ బద్దలవ్వడం ఖాయం

బాలయ్యకు పర్ఫెక్ట్ టైటిల్.. ఇక రికార్డ్స్ బద్దలవ్వడం ఖాయం

నందమూరి బాలకృష్ణ హీరోగా, టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఒక మాస్ ఎంటర్టైనర్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వీరసింహ రెడ్డి వంటి సూపర్ హిట్ తరువాత బాలయ్య నుండి వస్తున్న  సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే నెలకొన్నాయి.

ఈ సినిమలో టాలీవుడ్ లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల బాలకృష్ణ కూతురి పాత్రలో కనిపించనుంది. కూతురంటే సొంత కూతురు కాదు.. బాలకృష్ణ అన్న కూతురు. అయితే శ్రీలీలకు నాన్నగా చేస్తుంది ఎవరు అనేది ఇప్పటికైతే సస్పెన్సే. NBK108 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియా వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమా కోసం ముందుగా "బ్రో..ఐ డోంట్ కేర్" అనే టైటిల్ ను పరిశీలించారట మేకర్స్. అయితే "బ్రో" టైటిల్ ను పవన్ సినిమా కోసం వాడేస్తుండటంతో.. ప్రస్తుతం ఈ సినిమాకు మోనార్క్ అనే టైటిల్ ఫిక్స్ చేసే ఆలోచనలో టీం ఉన్నట్లు సమాచారం. 

ఈ టైటిల్ అయితే బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుదని టీం భావిస్తున్నారట. ఆల్మోస్ట్ ఇదే టైటిల్ ఫిక్స్ అయ్యే చాన్సేస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ టైటిల్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పక్క మాస్ అండ్ రివెంజ్ డ్రామాతో రానున్న ఈ సినిమాకి టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి విడుదల తరువాత ఈ సినిమా ఎన్ని కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే దసరా వరకు ఆగాల్సిందే.