కొత్త జిల్లా కోసం రేపు హిందూపురంలో బాలకృష్ణ ర్యాలీ

కొత్త జిల్లా కోసం రేపు హిందూపురంలో బాలకృష్ణ ర్యాలీ

ఆంధ్రప్రదేశ్ హిందూపురం కేంద్రంగా జిల్లా ప్రకటించాలని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. రేపు(శుక్రవారం) ఉదయం హిందూపురంలో ఆయన ర్యాలీ నిర్వహించనున్నారు. పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ జరగనుంది. ర్యాలీ తర్వాత అంబేద్కర్ విగ్రహం దగ్గర  బాలకృష్ణ మౌన దీక్ష చేపట్టనున్నారు. ఉద్యమ కార్యాచరణపై శుక్రవారం సాయంత్రం అఖిలపక్ష నేతలతో చర్చించనున్నారు.  ఆ తర్వాత  టీడీపీ కార్యకర్తలతోనూ సమావేశం కానున్నారు.

మరిన్ని వార్తల కోసం..