మాది జన్మజన్మల బంధం.. మమ్మల్ని దేవుడే కలిపాడు

మాది జన్మజన్మల బంధం.. మమ్మల్ని దేవుడే కలిపాడు

హైదరాబాద్: అఖండమైన సినిమాలు వచ్చేలా తనను, బోయపాటి శ్రీనును ఆ దేవదేవుడే కలిపాడని నటసింహం నందమూరి బాలకృష్ణ అన్నారు. అఖండ మూవీ అర్థ శతదినోత్సవ వేడుకలో బాలయ్య పాల్గొన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ లో నిర్వహించిన ఈ వేడుకకు బాలయ్య విచ్చేశారు. ప్రేక్షకులు అఖండ సినిమా చూస్తుండగానే  బాలకృష్ణ  విచ్చేసి అభిమానులను అలరించారు. దీంతో వారి ఆనందానికి అవధులు లేవు. అనంతరం బాలయ్య మాట్లాడుతూ.. ఈ సినిమాను థియేటర్లలో ఆదరించినట్లుగానే, హాట్ స్టార్ ఓటీటీలోనూ గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరారు. అఖండ విజయాన్ని స్వర్గీయ ఎన్టీఆర్ కు అంకితం ఇస్తున్నామని డైరెక్టర్ బోయపాటి శ్రీను అన్నారు. 

మా కలయిక జన్మజన్మలది: బాలకృష్ణ 

‘ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కు వస్తుంటే మా రామకృష్ణ స్టూడియో జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. స్టూడియోలో నాన్న కోసం టిఫిన్ తీసుకొచ్చేవాడ్ని. అఖండ మూవీ విజయం ప్రేక్షకులది. ఇది వారు ఇచ్చిన విజయం. మా టీమ్ సమిష్టి కృషి. శివభక్తుడిగా నేను చేసిన అఖండలోని పాత్ర.. నాన్న చేసిన పాత్రలు గుర్తుచేసుంటూ పోషించా. మొన్ననే సంక్రాంతి పండుగ జరుపుకున్నాం. ఇప్పుడు అఖండ పండుగ ఇది. కొవిడ్ సమయంలో థియేటర్లకు ప్రేక్షకులు వస్తారోరారో అనుకున్న సమయంలో, తీర్థయాత్రలకు వచ్చినట్లు థియేటర్లకు జనాలు వచ్చారు. ఇది ఆంధ్ర, తెలంగాణే కాదు.. కర్నాటక, మహారాష్ట్ర, ఒరిస్సా అలాగే యావత్ ప్రపంచ పండుగ. ఈ వేడుకను పలుచోట్ల అభిమానులు జరుపుకుంటున్నారు. అందుకు గర్వంగా ఉంది. ఈ సినిమా విజయం సాధించేలా చేసిన ఆది దంపతులకు కృతజ్ఞతలు. కలుషితమైనపోయిన సమాజానికి ప్రక్షాణనగా ఈ సినిమా ఉంది. ఇక బోయపాటి శ్రీను, నా కాంబినేషన్ హ్యాట్రిక్. మా కలయిక జన్మజన్మలది. అందుకే ఆ దేవుడే మమ్మల్ని కలిపాడు’ అని బాలయ్య పేర్కొన్నారు. అనంతరం యాభైరోజుల జ్ఞాపికలు బాలకృష్ణ ఎగ్జిబిటర్లకు పంపిణీదారులకు అందజేశారు. 

దర్శకుడు బోయపాటి శ్రీను జై బాలయ్య అంటూ అభిమానులను హుషారెత్తిస్తూ మాట్లాడారు. పరమేశ్వరుని ఆశీస్సులతో, తెలుగు ప్రేక్షకుల అండదండలతో ఈ సినిమాకు సహకరించిన నిర్మాతలకు అఖండ విజయం సాధించి పెట్టిందన్నారు. మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించారన్నారు. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. మనం ఏదైనా కల కంటే అది నిజమైతే ఆనందంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో నైజాం పంపిణీదారుడు శిరీష్ రెడ్డి, సుదర్శన్ థియేటర్ అధినేత బాల గోవిందరాజు, మేనేజర్ బాలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం: 

భారతీయులకు వాల్ మార్ట్ బంపర్ ఆఫర్

టీఆర్ఎస్​ కేడర్​కు నక్సల్స్ వార్నింగ్