
కుత్బుల్లాపూర్: వ్యవసాయ ఎరువుల తయారీ గోదాంపై గురువారం బాలనగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు రైడ్స్ చేశారు. దూలపల్లి, రామ్ రెడ్డి నగర్ లో నిబంధనలకు విరుద్ధంగా తయారు చేసి, విక్రయిస్తున్న వ్యవసాయ ఎరువులు, పురుగు మందులను గుర్తించారు. అగ్రి టెక్ అండ్ కెమికల్స్ పేరుతో బయో ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు. గోదాం నిర్వహకుడు సతీష్ రెడ్డిపై కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు తెలిపారు. గుట్టు చప్పుడు కాకుండా ఓ గోదాములో నిల్వ ఉంచిన 3వేల 222లీటర్ల బయో మందులు, 4వేల 600 లీటర్ల ఫ్యాక్ చేసిన పురుగు మందులు అధికారులు సీజ్ చేశారు. వాటి విలువ దాదాపు రూ.30లక్షల 32వేలు ఉంటుందని తెలిపారు.