
ఓ వైపు ఎమ్మెల్యేగా బిజీగా ఉంటూనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు బాలకృష్ణ. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ‘అఖండ2’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. దసరాకి ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా బాలయ్య నెక్స్ట్ మూవీ విషయంలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. రీసెంట్‌గా అజిత్‌తో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాన్ని రూపొందించిన అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్‌లో బాలకృష్ణ నటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కథ విన్న బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని కూడా నిర్మించనుందని, వచ్చే నెలలో ఈ సినిమాను ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. మరోవైపు బాలకృష్ణ నెక్స్ట్ చేయబోయే దర్శకుల లిస్టులో గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ పేర్లు వినిపించగా, తాజాగా అధిక్ రవి చంద్రన్ పేరు ఫైనల్ కావడం ఆసక్తిని పెంచుతోంది.