Balakrishna: 'అఖండ 2: తాండవం'బ్లాస్టింగ్ రోర్ వీడియో రిలీజ్! గూస్‌బంప్స్ తెప్పిస్తున్న బాలయ్య డైలాగ్స్!

Balakrishna: 'అఖండ 2: తాండవం'బ్లాస్టింగ్ రోర్ వీడియో రిలీజ్! గూస్‌బంప్స్ తెప్పిస్తున్న బాలయ్య డైలాగ్స్!

'గాడ్ ఆఫ్ మాసెస్' నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. వీరి రికార్డుల పరంపరలో వచ్చిన మరో ప్రెస్టీజియస్ సీక్వెల్ 'అఖండ 2: తాండవం' ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. 2021లో అఖండ సృష్టించిన సునామీని మించి, ఈ తాండవం మరింత రౌద్రంగా ఉండబోతోందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

అంచనాలు పెంచిన 'బ్లాస్టింగ్ రోర్' వీడియో!

లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి విడుదలైన 'బ్లాస్టింగ్ రోర్' అనే వీడియో యాక్షన్ ప్రియులకు పూనకాలు తెప్పిస్తోంది. బాలకృష్ణ ఫైట్ సీన్‌లోని కొన్ని పవర్‌ఫుల్ విజువల్స్‌తో పాటు, ఆయన చెప్పిన డైలాగ్స్ మాస్‌ ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెస్తున్నాయి. ముఖ్యంగా, "ఫైట్ సీన్స్ లో సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో.. ఏ సౌండ్ కు నవ్వుతానో.. ఏ సౌండ్ కు నరుకుతానో నాకే తెలియదు.. ఊహా కూడా అందదు.." అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంటుంది. దీనిలో బాలయ్య డబుల్ రోల్ చేస్తున్నారు. ఈసారి నాగసాధువు పాత్ర మరింత ఊహించని కోణంలో ఉంటుందని స్పష్టం చేస్తోంది.

విడుదల తేదీ ఖరారు..

ఈ చిన్నపాటి గ్లింప్స్‌ను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రికార్డు సృష్టించేందుకు సిద్ధమవుతోంది. 'అఖండ 2: తాండవం' చిత్రం డిసెంబర్ 5, 2025 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నందమూరి కుటుంబం నుంచి ఎం. తేజస్విని నందమూరి ఈ ప్రాజెక్ట్‌ను సమర్పించడం విశేషం. 

ఇప్పటికే విడుదలైన టీజర్, బాలకృష్ణ మంచు కొండల్లో నాగసాధువు గెటప్‌లో కనిపించిన విజువల్స్ అఖండ క్యారెక్టర్‌ను మరో స్థాయిలో నిలబెట్టాయి.  తమన్ ఎప్పటిలాగే తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ప్రాణం పోస్తున్నారు. శివుడి త్రిశూలం పట్టుకుని బాలయ్య చేసే పోరాటం, అధర్మంపై ధర్మాన్ని నిలబెట్టే సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానున్నాయి. డిసెంబర్ 5 కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.