ట్రెండింగ్లో బాల్కసురుడి వధ వీడియో

ట్రెండింగ్లో బాల్కసురుడి వధ వీడియో

బాల్కా సురుడి వధ అనే వీడియో సోషల్ మీడియోలో ట్రెండింగ్ లోకి వచ్చింది. చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి అభిమానులు పోస్ట్ చేసిన ఈ వీడియో చర్చనీయాంశంగా మారింది. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అరాచకాలపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది. బాల్కాసురుడి వధ అనే హ్యాష్ ట్యాగ్ తో నేషనల్ వైడ్ గా సెకండ్ ప్లేస్ లో ట్రెండింగ్  అవుతోంది.  ఈ ట్రెడింగ్ వీడియో చెన్నూరు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.
 
చెన్నూరులో కాంగ్రెస్ నుంచి వివేక్ వెంకటస్వామి పోటీ చేస్తుండగా.. బీఆర్ఎస్ నుంచి బాల్కసుమన్ పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి దుర్గం అశోక్ బరిలోకి దిగుతున్నారు. వివేక్ వెంకటస్వామి ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటా తిరుగుతూ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను వివరిస్తున్నారు.