నిజామాబాద్ లో.. బ్యాలెట్  పోరు

నిజామాబాద్ లో.. బ్యాలెట్  పోరు

భారీగా నామినేషన్లు దాఖలైన నేపథ్యం లో నిజామాబాద్ లోక్ సభ స్థానానికి బ్యాలెట్​ విధానంలోఎన్నిక నిర్వహించేం దుకు సిద్ధం గా ఉన్నామని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రజత్ కుమార్ చెప్పారు . అత్యధికంగా నిజామాబాద్ లో 245, సికిం ద్రాబాద్ లో 67, నల్లగొండలో 48 నామినేషన్లు దాఖలైనట్టు చెప్పారు .రాష్ట్రంలోని లోక్ సభ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ముగిసి న నేపథ్యం లో సోమవారం సాయంత్రం రజత్ కుమార్ మీడియాతో మాట్లాడారు. మొత్తంగా 17 లోక్ సభ స్థానాలకు 795 నామినేషన్లు వచ్చాయని తెలిపారు. నిజామాబాద్ లో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు బరిలో మిగిలి తే.. బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా ఎన్నికలు నిర్వహి స్తామన్నారు . మంగళవారం నామినేషన్ల స్క్రూటినీ ఉంటుందని, 28వ తేదీ వరకు విత్‌డ్రా గడువు ఉందని, ఆ తర్వాత స్పష్టత వస్తుందని వివరించారు.నామినేషన్ల పరిశీలన సందర్భం గా ఒక్కో అభ్యర్థి తరఫున నలుగురిని మాత్రమే అనుమతిస్తారని,పత్రాలన్నింటి నీ క్షుణ్నం గా తనిఖీ చేస్తారని చెప్పారు .

ప్రగతిభవన్ ఫిర్యాదు సీఈసీకి…

సీఎం కేసీఆర్‌ అధికారిక నివాసం ప్రగతిభవన్ లో పొలిటి కల్‌ యాక్టివిటీ అంశంపై తమకు ఫిర్యాదు అందిందని రజత్ చెప్పారు . దీనిపై టీఆర్‌ఎస్‌ నుంచి వివరణ కోరామన్నారు . ఈ అంశా న్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు . ఎన్నికల సభలో సీఎం కేసీఆర్‌ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారంటూ వీహెచ్ పీ చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపామన్నారు. సంబంధిత రికార్డులను తాను స్వయంగా విన్నానని, ఫిర్యా దులో పేర్కొన్నట్టు గా సీఎం కేసీఆర్‌ మాట్లాడలేదని గుర్తించామని తెలిపారు. నిజామాబాద్‌  రిటర్నింగ్​ ఆఫీసర్ పై రైతులు ఫిర్యాదు చేయడంతో..తాను వీడియో రికార్డులను పరిశీలిం చానని, నిబంధనల ఉల్లం ఘన ఏదీ జరగలేదని చెప్పారు . సోషల్ మీడియాలో ప్రకటనలకు ఎంసీఎంసీ (మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్​కమిటీ) ప్రీ సర్టిఫికేషన్ తీసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. ఆ ప్రచారానికి అయ్యే ఖర్చును ప్రచార వ్యయంలో చేర్చాలని చెప్పారు . బల్క్‌ ఎస్సెమ్మెస్ లు, వాయిస్‌ మెసే జీలకూ ప్రీ సర్టిఫికేషన్‌ తప్పనిసరి అని చెప్పారు . రాష్ట్రంలోని ఏడు రాజకీయ పార్టీల స్టార్ క్యాంపెయినర్ల లిస్టులకు రజత్ కుమార్‌ ఆమోదం తెలిపారు.