దేశవ్యాప్తంగా బ్యాలెట్ ఉద్యమం: మమత

దేశవ్యాప్తంగా బ్యాలెట్ ఉద్యమం: మమత

లోక్​సభ ఎన్నికల్లో వాడిన ఎలక్ట్రానిక్​ ఓటింగ్​ మెషీన్లను తనిఖీ చేయాలని, అందుకోసం రాజ్యాంగబద్ధ ఫ్యాక్ట్​ ఫైండింగ్​ కమిటీ వేయాలని వెస్ట్ ​బెంగాల్​ సీఎం మమతా బెనర్జీ డిమాండ్​ చేశారు. ఈవీఎంలతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, తిరిగి బ్యాలెట్​ పేపర్​ విధానంతోనే దాన్ని కాపాడుకోగలమన్నారు. సోమవారం కోల్​కతాలో జరిగిన టీఎంసీ సమావేశంలో మాట్లాడారు. దేశంలో జరగబోయే అన్ని ఎన్నికల్ని బ్యాలెట్​ విధానంలోనే జరపాలన్న డిమాండ్​తో ఉద్యమం చేపడతానన్నారు. తమతో  కలిసిరావాలని23 ప్రతిపక్ష పార్టీలకు పిలుపిచ్చారు.

బీజేపీ ఆఫీస్​కు టీఎంసీ రంగుపూసిన దీదీ...

నార్త్​పరగణ జిల్లాలోని బీజేపీ ఆఫీసు వద్ద మమత హల్​చల్​ చేసిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెంగాల్​లో బీజేపీ హింసకు పాల్పడటాన్ని నిరసిస్తూ మే 30న దీదీ  నిహాటీలో ధర్నా చేశారు. తర్వాత స్థానిక బీజేపీ ఆఫీసు వద్దకు వెళ్లారు. ఆఫీసు తాళాలు పగులగొట్టి లోపలికెళ్లి, కాషయం రంగులో ఉన్న గోడపై తృణమూల్ పార్టీ పేరు, మూడు పువ్వుల సింబల్​ని చిత్రించారు.