రాందేవ్ బాబా పతంజలి సంస్థకు ఉత్తరాఖండ్ సర్కార్ ఊరట

రాందేవ్ బాబా పతంజలి సంస్థకు ఉత్తరాఖండ్ సర్కార్ ఊరట

యోగా గురు రాందేవ్ బాబాకు చెందిన పతంజలికి ఉత్తరాఖండ్ సర్కార్ ఊరటనిచ్చింది. పతంజలికి చెందిన దివ్య ఫార్మసీ ఔషధాలను ఐదింటిని బ్యాన్ చేస్తూ ఇటీవల విధించిన నిషేధాన్ని ఎత్తేసింది. ఆ మందులను తిరిగి విక్రయించుకోవచ్చని స్పష్టం చేసింది. చిన్న తప్పిదం వల్లే ఇలా జరిగిందని హెల్త్ అథారిటీ డ్రగ్ కంట్రోలర్ జీసీఎన్ జంగ్‌పాంగి చెప్పారు. నిషేధం విధించే ముందు కంపెనీకి సమయం ఇచ్చి ఉండాల్సింది అని అభిప్రాయపడ్డారు. 
 
దివ్య ఫార్మసీకి చెందిన మధుమేహం, రక్తపోటు, గాయిటర్, గ్లాకోమా, అధిక కొలెస్ట్రాల్‌కు సంబంధించిన ఐదు మందుల ఉత్పత్తిని నిలిపివేయాలని ఈ నెల 9న ఉత్తరాఖండ్ అయుర్వేద, యునానీ లైసెన్సింగ్ అథారిటీ ఆదేశించింది. అనుమతులు పొందకుండా వీటి ఉత్పత్తిని కొనసాగిస్తున్నారని.. తమ అనుమతులు పొందిన తర్వాతే వీటి తయారీని ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా తప్పుదోవ పట్టించే ప్రకటనలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. కాగా ప్రభుత్వ తాజా నిర్ణయంపై సంస్థ రాందేవ్ సన్నిహితులు ఆచార్య బాలకృష్ణ హర్షం వ్యక్తం చేస్తూ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.