NED vs BAN: నెదర్లాండ్స్ చేతిలో ఓటమి.. చెప్పుతో కొట్టుకున్న బంగ్లా అభిమాని

NED vs BAN: నెదర్లాండ్స్ చేతిలో ఓటమి.. చెప్పుతో కొట్టుకున్న బంగ్లా అభిమాని

ప్రపంచ కప్ 2023లో పసికూన జట్ల విజయాలు అగ్రశ్రేణి జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. తమకంటే తక్కువ స్థాయి జట్లపై ఓటములను ఆభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో పరాభవాన్ని ఎదుర్కొన్న పాకిస్తాన్ జట్టు పరిస్థితి అచ్చం అలాంటిది. ఆ జట్టు ఆటగాళ్లను తిట్టని వారంటూ ఎవ్వరూ లేరు. తాజాగా బంగ్లాదేశ్ క్రికెటర్లకు ఆ దేశ అభిమానుల నుంచి అలాంటి నిరసనే ఎదురైంది. 

శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మొదట నెదర్లాండ్స్ బ్యాటర్లను 229 పరుగుల స్వల్ప స్కోరుకే కట్టడి చేసినప్పటికీ.. ఛేదనలో తడబడ్డారు. 42.2 ఓవర్లలో 142 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యారు. ఈ ఓటమిపై బంగ్లా అభిమానులు భగ్గుమంటున్నారు. దేశం పరువు తీశారంటూ క్రికెటర్లపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. 

ఇదిలావుంటే, మ్యాచ్ వీక్షించడానికి ఈడెన్ గార్డెన్స్ స్టేడియానికి విచ్చేసిన ఒక  బంగ్లా అభిమాని.. చెప్పుతో కొట్టుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "మేము పెద్ద జట్లతో ఓడిపోవడాన్ని పట్టించుకోవడం లేదు. కానీ మీరు నెదర్లాండ్స్‌తో ఎలా ఓడిపోతారు? షకీబ్, ముష్ఫిక్ అంటూ ఓ బంగ్లా అభిమాని కోపంతో ఊగిపోయాడు. ఒక  బంగ్లా పౌరుడిగా మీ తరుపున నేను చెప్పుతో కొట్టుకుంటున్నా అంటూ చెంపలపై వేయించుకున్నాడు. ఎన్నో వ్యయప్రయాసలు కూర్చి మ్యాచ్ చూడడానికి వచ్చిన తమకు ఇది విచారకరం అంటూ అభిమాని తన బాధను వెళ్లగక్కాడు.

9వ స్థానంలో బంగ్లా

ఈ టోర్నీలో ఇప్పటివరకూ 6 మ్యాచ్‌లు ఆడిన బంగ్లా ఐదింట ఓటమిపాలైంది. ఒక్క ఆఫ్ఘనిస్తాన్ పై మాత్రమే విజయాన్ని అందుకుంది.

ALSO READ :- గోమాతకు స్వయంవరం.. వెడ్డింగ్ కార్డ్ వైరల్