
లక్నో: లక్నోలోని చార్‌బాగ్ రైల్వే స్టేషన్‌లో అరటి పండ్ల అమ్మకంపై అధికారులు బ్యాన్ విధించారు. అరటి పండు తొక్కలతో స్టేషన్ ఏరియా అంతా అపరిశుభ్రంగా అవుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెప్పారు. రూల్స్ పాటించకుంటే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని ఉత్తర్వులు జారీ చేశారు. బ్యాన్‌పై ప్యాసింజర్లు, వ్యాపారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పేదవాళ్లు ఎక్కువగా అరటిపండ్లే కొంటారని, దాదాపు ఐదు రోజుల నుంచి అరటిపండ్లు అమ్మకపోవడం వల్ల వ్యాపారం సరిగా లేదని వ్యాపారి ఒకరు చెప్పారు. “ రైల్వే స్టేషన్‌ను శుభ్రంగా ఉంచాలంటే ముందు టాయిలెట్స్‌ను నీట్‌గా ఉంచాలి. అరటిపండ్ల తొక్క వల్ల పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిజానికి బ్యాన్ చేయాల్సింది ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, చిప్స్ ప్యాకెట్ల లాంటి వస్తువులు” అని అరవింద్ అనే ప్యాసింజర్ అన్నారు.