బండారి లక్ష్మారెడ్డికి వడ్డెర సంక్షేమ సంఘం మద్దతు

 బండారి లక్ష్మారెడ్డికి వడ్డెర సంక్షేమ సంఘం మద్దతు

ఉప్పల్, వెలుగు:  రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్​ను మూడోసారి సీఎం చేస్తామంటూ మీర్ పేట పరిధి రాజీవ్​నగర్ కాలనీలోని వడ్డెర సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. ఉప్పల్ సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి ఉప్పల్ నుంచి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు. 

వడ్డెర సంఘానికి సంక్షేమ భవనం నిర్మించాలని వారు కోరగా..అవసరమైన సాయం చేస్తానని లక్ష్మారెడ్డి వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి, మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ అంజయ్య, బీఆర్ఎస్ నాయకులు బొదాసు లక్ష్మీ నారాయణ, రవి, వడ్డెర సంఘం నాయకులు రాజయ్య,  లింగయ్య, ఎల్లయ్య, రాజు తదితరులుపాల్గొన్నారు.