
మంచిర్యాల: నాగ్‌పూర్ – -సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇవాళ్టి నుంచి (సెప్టెంబర్ 15) నుంచి మంచిర్యాలలో ఆగనుంది. ఈ ట్రెయిన్ ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంచిర్యాలలో జెండా ఊపి ప్రారంభించారు. పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రైల్వేశాఖ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
సికింద్రాబాద్–నాగ్‌పూర్ మధ్య ఉమ్మడి ఆదిలాబాద్ మీదుగా నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు మంచిర్యాల, కాగజ్‌నగర్‌లో హాల్టింగ్ కల్పిస్తూ రైల్వే శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. రైలు మొదలైన 11 నెలల తర్వాత, ఎంపీ గడ్డం వంశీకృష్ణ కృషితో హాల్టింగ్‌కు పర్మిషన్ రావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తగ్గనున్న ప్రయాణ సమయం
మంచిర్యాలలో వందేభారత్‌కు హాల్టింగ్ ఇవ్వడంతో ఇక్కడి నుంచి సికింద్రాబాద్‌కు కేవలం మూడు గంటల్లో చేరుకునే అవకాశం కలుగుతుంది. తెలంగాణ, మహారాష్ట్రలో 575 కిలోమీటర్లు ప్రయాణించే వందేభారత్ రైలుకు ఇప్పటికే కాజీపేట, రామగుండం, బల్లార్ష, చంద్రాపూర్, సేవాగ్రామ్‌లో హాల్టింగ్‌లు ఉండగా.. త్వరలోనే మంచిర్యాల, కాగజ్‌నగర్‌లో సైతం ఆగనుంది. నాగ్‌పూర్‌లో ప్రతి రోజు ఉదయం ఐదు గంటలకు మొదలయ్యే వందేభారత్.. మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుటుంంది. సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం ఒంటిగంటకు బయల్టేరి రాత్రి 8.20 గంటలకు నాగ్‌పూర్ చేరుకుంటుంది