అసెంబ్లీ వేదికగా కేటీఆర్ దేశ ద్రోహ వ్యాఖ్యలు చేసిండు

అసెంబ్లీ వేదికగా కేటీఆర్ దేశ ద్రోహ వ్యాఖ్యలు చేసిండు

హైదరాబాద్: కంటోన్మెంట్ కు కరెంటు, నీళ్లు బంద్ చేస్తామంటూ అసెంబ్లీ వేదికగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా తప్పుబట్టారు. దేశాన్ని రక్షించే సైనికులు, వాళ్ల కుటుంబాలు ఉండే ప్రాంతానికి కరెంట్, నీళ్లు కట్ చేస్తానంటూ మంత్రి మాట్లాడడం దుర్మార్గమని అన్నారు. దమ్ముంటే కంటోన్మెంట్ కు కరెంట్ కట్ చేయండి చూస్తామని సవాల్ విసిరారు. నీళ్లు, కరెంటు బంద్ చెయ్ చూస్తాం.. మాడి మసైపోతావ్ అంటూ  హెచ్చరించారు. కంటోన్మెంట్ లో సైనికులుంటారని.. వాళ్లు నిరంతరం సిటీకి రక్షణగా ఉన్నారని అన్నారు. ఎంత దమ్ముంటే దేశ సైనికులు ఉన్న చోటులోనే కరెంటు కట్ చేస్తా అంటావ్ అని ప్రశ్నించారు. అసెంబ్లీ వేదికగా కేటీఆర్ దేశ ద్రోహ వ్యాఖ్యలు చేశారని బండి సంజయ్ మండిపడ్డారు. దేశ విచ్ఛిన్న వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తల కోసం..

ప్రజల వైపు మాట్లాడేవాళ్లు లేరు.. అందుకే వచ్చా

ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా జర్నలిస్ట్ మృతి

అవినీతి లేకుండా డబ్బంతా పేదలకే ఖర్చు చేస్తాం