కేసీఆర్ చేతకానితనంతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం

కేసీఆర్ చేతకానితనంతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై మంగళవారం కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. హైదరాబాద్ నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్..  ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలోని అధికారిక నివాసం నుంచి పాల్గొన్నారు. అయితే.. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో శ్రీశైలం గురించి సీఎం కేసీఆర్ ఒక్క మాటమాట్లాడలేదని తప్పుబట్టాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కుమ్మక్కయ్యారన్నారు. ఎజెండా పంపకపోవడంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఇద్దరు సీఎంలు తెలుగు రాష్ట్రాల ప్రజలను మోసం చేస్తున్నారన్న బండి సంజయ్.. కేసీఆర్ చేతకానితనంతో  కృష్ణానీటి వాటా కోల్పోయామని చెప్పారు.

ఆరేళ్ల నుంచి ట్రెబ్యునల్ పేరుతో మోసం చేశాడని.. నీటివాటా కోసం మాట్లాడకుండా తోక ముడిచాడన్నారు. డీపీఆర్ లు పంపకపోవడానికి కారంణ ఎంటో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. కేంద్రాన్ని తప్పు బట్టిన కేసీఆర్ కపట నాటకం ఇవ్వాల బయటపడిందని తెలిపారు బండి సంజయ్. తెలంగాణ పౌరుషం ఉంటే నిజాలు చెప్పాలన్నారు బండి సంజయ్. ఇద్దరు సీఎంల మాట ఒక్కటేనని అపెక్స్ కౌన్సిల్ ద్వారా రుజువైందని తెలిపారు. కృష్ణా జల్లాలో తెలంగాణకు 575 టీఎంసీలు రావాల్సి ఉంటే.. కేసీఆర్ 299 టీఎంసీలకు ఒప్పుకోవడం అన్యాయమన్నారు. కేసీఆర్ 299 టీఎంసీలకు అంగీకరిస్తూ సంతకం పెట్టడాన్ని.. జగన్ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించినట్లు తెలిసిందని తెలిపారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నీటి వాటాను అడగకుండా.. కేసీఆర్ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేసీఆర్ తాకట్టుపెడుతున్నారన్నారు. కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని.. చరిత్ర క్షమించదన్నారు బండి సంజయ్.