ప్రయాణికుల భద్రతపై ఫోకస్ పెట్టండి : మంత్రి బండి సంజయ్

ప్రయాణికుల భద్రతపై ఫోకస్ పెట్టండి : మంత్రి బండి సంజయ్
  • రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచన
  • తిమ్మాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బస్సు-ట్రాక్టర్ ప్రమాదంపై దిగ్ర్భాంతి

న్యూఢిల్లీ, వెలుగు: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణుగుంట శివారులో వడ్ల లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వెళ్తున్న ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మణిపూర్ పర్యటనలో ఉన్న ఆయన విషయం తెలిసిన వెంటనే కరీంనగర్ జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, తిమ్మాపూర్ పోలీసులతో ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాట్లాడి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. 

అయితే, రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలపై బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయాణికుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరారు. ప్రమాదాలకు చెక్ పెట్టేలా ప్రజలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే మంచిదని పేర్కొన్నారు.