వేములవాడ ఇన్ని రోజులు గుర్తు రాలేదా.. ఇప్పుడు దత్తత తీసుకుంటానంటున్నావ్: బండి సంజయ్

వేములవాడ ఇన్ని రోజులు గుర్తు రాలేదా.. ఇప్పుడు దత్తత తీసుకుంటానంటున్నావ్: బండి సంజయ్

ఎన్నికలు రాగానే మంత్రి కేటీఆర్ వేములవాడను దత్తత తీసుకుంటా అంటున్నాడు.. ఇన్ని రోజులు దత్తత తీసుకోవాలని గుర్తురాలేదా అని బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ రాజన్న ఆలయాన్ని 100 కోట్లతో డెవలప్ చేస్తానని చెప్పి ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. రేషన్ షాపులో బియ్యం మోదీ ప్రభుత్వం ఇస్తుంది.. కానీ రేషన్ షాపులో ఫోటోలు ఎవరివి ఉంటున్నాయని నిలదీశారు. తెలంగాణకు నిధులు ఇచ్చేది కేంద్రం అయితే.. సోకు రాష్ట్రానిదా అని మండిపడ్డారు. 

ప్రజల కోసం పోరాడితే నాపై కేసీఆర్ 74 కేసులు పెట్టాడని బండి సంజయ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే.. వాళ్ళు అమ్ముడు పోతారని తెలిపారు. తెలంగాణలో సమస్యలపై ఫైట్ చేసింది బీజెపీ అని వ్యాఖ్యానించారు. రుణమాఫీ, నిరుద్యోగ సమస్య, దళిత బంధు, బీసీ బంధు, పొడు భూముల సమస్యలపై పోరాడుతున్నామని తెలిపారు. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాన్ని పెకిలించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో రజాకార్ల రాజ్యం నడుస్తుందని... 80 శాతం ఉన్న హిందువుల ఓట్లు ఉన్నాయని తెలిపారు. కేసీఆర్ 5 లక్షల కోట్లు అప్పులు చేశాడని.. ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తారని నిలదీశారు. 
 
కాంగ్రెస్ పార్టీ వాళ్లు ముస్లిం ఓట్ల కోసం కపట ప్రేమలు చూపిస్తున్నారన్నారు. మోదీ ప్రభుత్వం ద్వారానే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని బండి సంజయ్ తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని చెప్పారు. ప్రధానికి చెప్పి... రాజన్న ఆలయాన్ని కాశీలాగా అభివృద్ధి చేస్తామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బీజేపీ అభ్యర్థి డా. వికాస్ రావుకు మద్దతుగా ఎంపీ బండి సంజయ్ రోడ్ షోలో పాల్గొన్నారు. మచ్చలేని లేని నాయకుడు విద్య సాగర్ రావు అని ఆయన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.