
హైదరాబాద్ : వరి-ఉరిపై దీక్షకు దిగారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సంజయ్ దీక్ష చేస్తున్నారు. వరి వేస్తే ఉరే అంటూ రైతులను భయపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. వడ్లు కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని.. కేసీఆర్ కు వచ్చిన ఇబ్బందేంటో చెప్పాలన్నారు సంజయ్. కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోబోమన్నారు. కేసీఆర్ వడ్లు ఎట్ల కొనడో చూస్తామన్నారు సంజయ్.