రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలి

రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలి

హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు బీజేపీ రుణపడి ఉంటుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.  కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల కోడ్ సాకుగా చూపి.. కేసీఆర్ దళిత బంధు ఆపేశారని..ఉప ఎన్నికి సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ రేపటి నుంచి సీఎం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు వ్యవహరించిన తీరు చూసి ప్రజలు ఆశ్చర్యపోయారన్నారు బండి సంజయ్. ఓటుకు రూ.6 వేల చొప్పున పంపిణీ చేశారని ఆరోపించారు. ధన ప్రలోభాలతో గెలవాలని చూశారని..అయితే టీఆర్ఎస్ అబద్ధాలను,జిమ్మిక్కులను ప్రజలు నమ్మలేదన్నారు. హుజురాబాద్ ప్రజలకు ఈటల అండగా ఉన్న వ్యక్తి అని..మంత్రిగా, ఆరు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన ఈటల గెలవడం  సంతోషంగా ఉందన్నారు బండి.