రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వ్యాట్ తగ్గించాలి

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వ్యాట్ తగ్గించాలి

సీఎం కేసీఆర్ దేశంలో ఏం సంచలనం సృష్టిస్తారో ప్రజలకు చెప్పాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ పెట్రోల్, డీజిల్ పై కేంద్రం వ్యాట్ తగ్గించినట్లే.. రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు.  రాష్ట్ర 30 శాతం వ్యాట్ విధిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రం ధరలు తగ్గిస్తే.. 80 రూపాయలకే పెట్రోల్ వస్తుందని అన్నారు. ఏం ఉద్దరించడానికి కేసీఆర్ దేశ పర్యటన వెళ్లారని నిలదీశారు. కేసీఆర్ సృష్టించే సంచలనం ప్రజలకు చెప్పాలన్నారు. అక్రమాస్తులు కాపాడుకోవడం కోసమే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారని ఆరోపించారు బండి సంజయ్. 

ఇక్కడ ఉద్యోగులకు జీతాలు రావడం లేదన్నారు.  ముందుగా.. తెలంగాణ రైతులను ఆదుకోవాలన్నారు.  కొండగట్టు బస్సు ప్రమాదంలో... చనిపోయిన వారి కుటుంబాలను కేసీఆర్ పరామర్శించ లేదు.. కానీ ఎక్కడో ఉన్న రైతు కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లారన్నారు. పెట్రోల్, డిజిల్ పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించించడంతో  పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వ్యాట్ తగ్గించాలన్నారు. అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికే  కేటీఆర్ విదేశీ పర్యటనలు చేస్తున్నారన్నారు.

 

ఢిల్లీపై ముంబై గెలుపుతో ఆర్సీబీ సంబరాలు

కొడితే ఓకేనా!: భర్తలు, భార్యల్ని కొట్టొచ్చట