కృష్ణాలో 299 టీఎంసీలకు కేసీఆర్ సంతకం పెట్టిండా లేదా? : -బండి సంజయ్

కృష్ణాలో 299 టీఎంసీలకు కేసీఆర్ సంతకం పెట్టిండా లేదా? : -బండి సంజయ్

కృష్ణా జలాలలో 299 టీఎంపీలకు తెలంగాణ సీఎం కేసీఆర్ సంతకం పెట్టిండా లేదా? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రశ్నించారు.  మోదీ కృష్ణా జలాల కోసం ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే కనీసం థాంక్స్ చెప్పనీ మూర్ఖుడు కేసీఆర్ అని విమర్శించారు. కేంద్రం కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయటంతో తన బండారం బయట పడుతోందని కేసీఆర్ భయపడుతున్నాడన్నారు.

సీఎం కేసీఆర్ నోరు తెరిస్తే అన్ని అబద్దాలేనని బండి సంజయ్ అన్నారు. ప్రధాని మోదీ రామగుండంలో వాస్తవాలు చెప్పాగానే సింగరేణి ప్రైవేటీకరణపై కేసీఆర్ వెనక్కి తగ్గారని ఆరోపించారు.  ఏపీ సీఎం జగన్  తో కుమ్మకై కేసీఆర్ దక్షిణ తెలంగాణకు ద్రోహం చేశాడని తీవ్ర ఆరోపణలు చేశారు.  నాగార్జునసాగర్ లో ప్రస్తుతం ఒక్క చుక్కనీరు లేకపోవటానికి కేసీఆరే కారణమని విమర్శించారు.  

కేంద్రం మోటార్లకు మీటర్లు ఎక్కడ పెట్టిందో బీఆర్ఎస్ చూపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ మాటలు నమ్మి రైతులు మరోసారి మోసపోవద్దన్నారు. ఎన్నికలు అయిపోయాక సీఎం  కేసీఆర్ రైతుబంధు బంద్ చేస్తారని ఆరోపించారు. 

 దక్షిణ తెలంగాణ రైతాంగాన్ని నట్టేట ముంచిందే కేసీఆర్ అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు బండి సంజయ్..  ఉచిత యూరియా హామీ ఎటు పోయిందో కేసీఆర్ చెప్పాలని డిమాండ్  చేశారు.   తెలంగాణ రైతులకు న్యాయం చేసింది కేంద్రమేనని సంజయ్..  రానున్న ఎన్నికలలో తెలంగాణ రైతులు బీజేపీకి తమ ఓటు వేసి మోడీకి గిఫ్ట్ ఇవ్వాలని తెలిపారు.  

ALSO READ : పొన్నాలకు బీఆర్ఎస్లో సముచితమైన స్థానం కల్పిస్తాం : కేటీఆర్‌