తనపై నమోదైన పోక్సో కేసు వ్యవహారంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు కేంద్రం మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరత్. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాల్సిందిగా హైకోర్టును కోరాడు. ఈ మేరకు 2026 మే 12వ తేదీన హైకోర్టులో పిటిషన్ వేశాడు బండి భగీరత్ .
హైకోర్టుకు వేసవి సెలవులు ఉండడంతో వెకేషన్ బెంచ్ లో పిటిషన్ వేశాడు భగీరత్. ఈ పిటిషన్ పై మే 14 న విచారణ చేయనుంది.
మరోవైపు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై నమోదు అయిన పోక్సో కేసుపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ కేసులో సమగ్ర విచారణ కోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 2026, మే 11వ తేదీ ఈ మేరకు రాష్ట్ర డీజీపీని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.
►ALSO READ | NEET: 90 బయాలజీ, 30 కెమిస్ట్రీ.. నీట్ పేపర్ లీకేజ్లో మొత్తం మ్యాచ్ అయిన ప్రశ్నలు..
హైదరాబాద్ సిటీలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై పోక్సో కేసు నమోదు అయ్యింది. 17 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధిత కుటుంబం కంప్లయింట్ చేసింది. మే 8వ తేదీన కంప్లయింట్ చేస్తే.. ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీ సీవీ ఆనంద్ ను ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని మోదీ పర్యటన, భద్రతా ఏర్పాట్లలో సిబ్బంది బిజీగా ఉండటంతో ఆలస్యం అయినట్లు వెల్లడించారు డీజీపీ.
