కేంద్రమంత్రి గజేంద్రసింగ్కు బండి సంజయ్ స్వాగతం

కేంద్రమంత్రి గజేంద్రసింగ్కు బండి సంజయ్ స్వాగతం

కాసేపట్లో  యాదాద్రి నుంచి బండి సంజయ్ మహాసంగ్రామయాత్ర ప్రారంభం కానుంది. మూడో విడత యాత్ర కోసం భారీ ఏర్పాట్లు చేశారు కార్యకర్తలు. ఉదయం ఖైరతాబాద్ అమ్మవారి టెంపుల్ లో పూజలు చేసిన సంజయ్.. పార్టీ కార్యాలయం నుంచి యాదాద్రికి చేరుకున్నారు. దారి మధ్యలో ఉప్పల్ లో సంజయ్ కు లోకల్ లీడర్లు భారీ స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే NVSS ఫ్రభాకర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు స్వాగతం చెప్పారు. కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెఖావత్ కూడా పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చారు.

ఘట్ కేసర్ లో కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెఖావత్ ను బండి సంజయ్ స్వాగతం పలికారు. ఘట్ కేసర్ పార్టీ ఆఫీసులో కేంద్రమంత్రిని సంజయ్ సన్మానించారు. అక్కడి నుంచి కేంద్రమంత్రితో కలిసి యాదగిరిగుట్టకు బయలుదేరారు. ఈ క్రమంలోనే బీబీనగర్, భువనగిరిలో బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.  అక్కడి నుంచి యాదగిరిగుట్టకు చేరుకున్న బండి సంజయ్.. శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శంచుకొని ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం యాదగిరిగుట్ట పట్టణ శివారులోని వంగపల్లి గ్రామంలో బహిరంగ సభ ప్రారంభం కానుంది.

తొలిరోజు యాదగిరిగుట్ట నుంచి ప్రారంభించి.. గంగసానిపల్లి, ముత్తిరెడ్డి గూడెం, బస్వాపూర్ వరకు యాత్ర సాగనుంది. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో ప్రజా సంగ్రామ యాత్ర సాగనుంది. మొదటి రోజు 10.5 కిలోమీటర్ల మేర యాత్ర సాగుతుంది. బస్వాపూర్ సమీపంలో మొదటిరోజు రాత్రి సంజయ్ బస చేస్తారు. రేపు హుస్సేన్ బాద్ రూరల్, భువనగిరి టౌన్, టీచర్స్ కాలనీల్లో యాత్ర సాగనుంది. ఆగస్ట్ 4న గొల్లగూడెం, మగ్దూంపల్లి, పెద్దపలుగు తండా, చిన్న రావుల్పల్లి, గుర్రాలదండిలో 11.7కి.మీ. మేర యాత్ర ఉంటుంది. ఆగస్ట్ 7వ తేదీ వరకు మొత్తం భువనగిరి నియోజకవర్గంలోనే పాదయాత్ర సాగనుంది. ఆ తర్వాత మునుగోడు నియోజకవర్గంలోకి పాదయాత్ర ఎంటర్ అవుతుంది.