కాంగ్రెస్​లో చేరిన బండ్లగూడ జాగీర్ మేయర్‌‌

కాంగ్రెస్​లో చేరిన బండ్లగూడ జాగీర్ మేయర్‌‌

గండిపేట్, వెలుగు: బండ్లగూడ జాగీరు కార్పొరేషన్‌‌ మేయర్‌‌ మహేందర్‌‌గౌడ్‌‌ బీఆర్ ఎస్ కు షాక్‌‌ ఇచ్చారు. తన వర్గం కార్పొరేటర్లతో కలిసి సోమవారం సీఎం రేవంత్‌‌రెడ్డిని కలిసిన అనంతరం కాంగ్రెస్ చేరారు. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్‌‌కు ప్రధాన అనుచరుడైన మేయర్‌‌ పై 16 మంది కార్పొరేటర్లు తిరుగుబాటు చేశారు.  అవిశ్వాసం పెట్టగా.. తేదీ సమీపిస్తుండగా.. సీఎంను మేయర్ కలిసిన తర్వాత పార్టీ మారడం చర్చనీయాంశమైంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌‌రెడ్డి, రాజేంద్రనగర్‌‌ కాంగ్రెస్‌‌ ఇన్‌‌చార్జ్ కస్తూరి నరేందర్‌‌ ఆధ్వర్యంలో సోమవారం సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు.  అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్‌‌ ఇన్‌‌చార్జ్  దీపాదాస్‌‌ మున్షి సమక్షంలో మేయర్ మహేందర్ గౌడ్, కార్పొరేటర్లు, అనుచరులతో కలిసి పార్టీలో చేరారు.  ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే కాంగ్రెస్​లో చేరినట్లు మేయర్‌‌ తెలిపారు. కార్పొరేటర్లు పద్మావతి, గోకరి శ్రీలత, బుర్ర సాయి సాగర్‌‌గౌడ్, శ్రీనివాస్, పాండు, మల్లేష్, రితేష్, సాయి తదితరులు ఉన్నారు.