వైద్యో నారాయణ హరీ. ప్రాణం పోసే వాడు దేవుడు ఐతే… ఆ ప్రాణం నిలబెట్టే వాడు వైద్యుడు అంటారు. అలాంటి వృత్తిలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు డాక్టర్లు. వైద్యం చేయించుకోవడానికి హాస్పిటల్ కు వచ్చే రోగులు…. ఏ కారణంతో చనిపోయినా…. అది డాక్టర్ల నిర్లక్ష్యంతోనే జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. మరికొన్ని సార్లు డాక్టర్ల తీరు విమర్శలకు కారణమవుతోంది. కొన్ని సందర్భాల్లో రోగి బంధువులు డాక్టర్లపై దాడి చేసిన ఘటనలు జరుగుతున్నాయి.
కోల్ కతాలో డాక్టర్ పై రోగి బంధువుల దాడితో మరోసారి ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది. ప్రాణాలు కాపాడే తమకే రక్షణ కరువైందని దేశవ్యాప్తంగా రోడ్లపైకి వచ్చారు డాక్టర్లు. తమ రక్షణ కోసం కేంద్రమే చట్టం తేవాలని డిమాండ్ చేస్తున్నారు.
సమ్మె ఉద్రిక్తంగా మారుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. డాక్టర్ల డిమాండ్ మేరకు సీఎం మమతాబెనర్జీతో జరిగే సమావేశం మొత్తాన్ని రికార్డు చేసేందుకు అంగీకరించింది. ఈ మేరకు బెంగాల్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లకు రాసిన ఓ లేఖలో తెలిపారు.
West Bengal: CM Mamata Banerjee arrives for meeting with representatives of doctors at Nabanna. pic.twitter.com/ebcD15p026
— ANI (@ANI) June 17, 2019
