తేజస్వి సూర్య vs సౌమ్య రెడ్డి : ఆసక్తికరంగా బెంగుళూరు సౌత్ పార్లమెంట్

  తేజస్వి సూర్య vs సౌమ్య రెడ్డి :  ఆసక్తికరంగా బెంగుళూరు సౌత్ పార్లమెంట్

కర్నాటకలోని ప్రముఖ లోక్‌సభ నియోజకవర్గాలలో బెంగుళూరు సౌత్ ఒకటి.  ఒకరకంగా ఈ నియోజకవర్గం బీజేపీ కంచుకోటననే చెప్పాలి. 1991 నుంచి జరిగిన లోక్ సభ ఎన్నికలల్లో  ఒక్క సారి కూడా బీజేపీ ఓడిపోలేదు.  స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ రెండుసార్లు మాత్రమే ఇక్కడి నుంచి విజయం సాధించింది - ప్రస్తుతం ఇక్కడి నుంచి ఎంపీగా  తేజస్వి సూర్య ఉన్నారు. ఈ సారి ఈయనపై  కాంగ్రెస్ నుంచి సౌమ్యా రెడ్డి పోటీ చేస్తు్ండంతో బెంగుళూరు సౌత్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.  

బెంగళూరు సౌత్ లో రెండుసార్లు(1951, 89) మాత్రమే కాంగ్రెస్‌ గెలిచింది.  ఇక 1991 నుండి బీజేపీ ఇక్కడి నుంచి గెలుస్తూనే వస్తుంది.  అనంత్ కుమార్ 1996 నుండి ఇక్కడినుంచి ఆరుసార్లు ఎంపీ ఉన్నారు  2018లో ఆయన మరణించడంతో 2019 ఎన్నికల్లో బీజేపీ  యువమోర్చా అధ్యక్షుడు సూర్యను బీజేపీ పోటీకి దింపింది. కాంగ్రెస్‌ నేత బీకే హరిప్రసాద్‌ను ఓడించి ఆయన  విజయం సాధించారు.

2024  పార్లమెంట్ ఎన్నికల్లో  బీజేపీ మరోసారి  తేజస్వి సూర్యను బరిలో దింపగా... కాంగ్రెస్  సౌమ్యారెడ్డిని బరిలో నిలిపింది.  కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి కుమార్తెనే ఈ  సౌమ్యారెడ్డి.  ఆమె  ప్రస్తుతం కర్ణాటక మహిళా కాంగ్రెస్  ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.  2018లో జయనగర్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు.  2023లో  జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేత సికె రామమూర్తి చేతిలో ఓడిపోయారు.