V6 News

న్యూజిలాండ్‌‌‌‌కు బంగ్లా షాక్‌‌‌‌.. 6 వికెట్ల తేడాతో గెలుపు

న్యూజిలాండ్‌‌‌‌కు బంగ్లా షాక్‌‌‌‌.. 6 వికెట్ల తేడాతో గెలుపు

ఛటోగ్రామ్: తౌహిద్ హృదయ్ (51 నాటౌట్) మెరుపు హాఫ్ సెంచరీతో రాణించడంతో సొంతగడ్డపై రికార్డు టార్గెట్ ఛేజ్ చేసిన బంగ్లాదేశ్ తొలి టీ20 మ్యాచ్‌‌‌‌లో న్యూజిలాండ్‌‌‌‌కు షాకిచ్చింది. మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో భాగంగా సోమవారం జరిగిన ఈ పోరులో 6 వికెట్ల తేడాతో గెలిచింది. 

తొలుత న్యూజిలాండ్ 20 ఓవర్లలో 182/6 స్కోరు చేసింది. ఓపెనర్ కేటెన్ క్లార్క్ (51), డేన్ క్లీవర్ (51) ఫిఫ్టీలతో రాణించగా.. చివర్లో జోష్ క్లార్క్‌‌‌‌సన్ (27 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.

రిషాద్ హుస్సేన్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం  బంగ్లాదేశ్ 18 ఓవర్లలోనే 183/4 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. ఛేజింగ్‌‌‌‌లో ఓ దశలో 77 /3 నిలిచిన జట్టును తౌహిద్ ఆదుకున్నాడు. పర్వేజ్ హుస్సేన్ (28), షమీమ్ హుస్సేన్ (31 నాటౌట్) కూడా రాణించడంతో బంగ్లా ఘన విజయం సాధించింది. రెండో మ్యాచ్ బుధవారం జరగనుంది.