IND vs BAN : భారత్ టార్గెట్ 272

IND vs BAN :   భారత్ టార్గెట్ 272

మీర్పూర్ వేదికగా జరుగుతున్న బంగ్లాదేశ్, భారత్ రెండో వన్డేలో బంగ్లా బ్యాటర్లు రాణించారు. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఆ జట్టు 271 పరుగులు చేసింది.  తొలి వన్డేలో రాణించిన మోహిదీ హసన్ మిరాజ్ మరోసారి మెరిశాడు. 4 సిక్సర్లు, 8 ఫోర్లతో సెంచరీ చేయగా ఆల్  రౌండర్ మహమ్మదుల్లా  77 పరుగులతో అదరగొట్టాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3, సిరాజ్ 2, ఉమ్రాన్‌ మాలిక్ 2 వికెట్లు తీశారు.

 

వెంట వెంటనే మూడు వికెట్లు కోల్పోయిన బంగ్లా

వాషింగ్ టన్ సుందర్ కి మూడు వికెట్లు

తర్వాత బాల్ కి (18.6) అఫీఫ్ హొస్సేన్ ని బౌల్డ్ చేసి బంగ్లాను దెబ్బ కొట్టాడు సుందర్. ఈ దెబ్బతో బంగ్లా వెంట వెంటనే మూడు వికెట్లు కోల్పోయింది. 

భారత బౌలర్ల ఆట బంగ్లాదేశ్ పై ప్రతీకారంగా అనిపిస్తుంది. ఏ బ్యాట్స్ మెన్ వచ్చినా కుదురుకోనివ్వటం లేదు. కట్టుదిట్టంగా బంతులు వేస్తూ, బంగ్లా బ్యాటర్లని కట్టడి చేస్తున్నారు. 19వ ఓవర్ వేసిన సుందర్ ఐదో బంతికి ముష్ఫికర్ రహీమ్ ని ఔట్ చేశాడు. సుందర్ వేసిన ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేసిన బంతి బౌన్స్ అయింది. బౌన్సర్ ని ఊహించని ముష్ఫికర్ షాట్ ఆడబోయి  డిఫెన్స్ కి వెళ్లాడు. దాంతో బాల్ ముష్ఫికర్ గ్లౌజ్ ని తాకి ధవన్ చేతిలో పడింది.

షకిబ్ అల్ హసన్ ఔట్

ఆచితూచి ఆడుతున్న షకిబ్ (8)ని 17వ ఓవర్లో ఔట్ చేశాడు సుందర్. ఓవర్ మొదటి బంతినుంచి బ్యాట్స్ మెన్ ని ఏ మాత్రం కుదురుకోనివ్వని సుందర్, 17వ ఓవర్ ఆరోబంతికి షకిబ్ ని ఔట్ చేశాడు. ఆ బంతిని స్వీప్ ఆడిన షకిబ్, థర్డ్ మ్యాన్ లో ఉన్న ధవన్ కి క్యాచ్ ఇచ్చి మరొకసారి ఆఫ్ స్పిన్నర్ కి దొరికి పోయాడు.

ఉమ్రాన్ మొదటి బంతికే

ఆదిలోనే తొలి రెండు వికెట్లు పోగొట్టుకున్న బంగ్లాదేశ్ నిలకడగా ఆడుతుంది. షాంటోతో కలిసి షకిబ్ గట్టి భాగస్వామ్యం నెలకొల్పే దిశగా ఆచితూచి ఆడారు. అయితే, 13వ ఓవర్ వేసిన ఉమ్రాన్ మాలిక్ మొదటి బంతికే (151 కి. మీ) షాంటో (21)ని క్లీన్ బౌల్డ్ చేశాడు.  దాంతో బంగ్లా 13 ఓవర్లలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయింది.

సిరాజ్ కి రెండు వికెట్లు

తొమ్మిదో ఓవర్ వేసిన సిరాజ్ రెండో వికెట్ ని సొంతం చేసుకున్నాడు. తొమ్మిదో ఓవర్ రెండో బంతికే లింటన్ దాస్ (7)ని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ ఓవర్ లో ఐదు డాట్ బాల్స్ వేసి ఒక పోర్ ఇచ్చాడు.

రోహిత్ చేతికి గాయం

సిరాజ్ వేసిన రెండో ఓవర్లో నాలుగో బంతి, అనముల్ బ్యాట్ కి ఎడ్జ్ తీసుకుని సెకండ్ స్లిప్ లో ఉన్న రోహిత్ శర్మ చేతిలో పడింది. క్యాచ్ అందుకోబోయిన రోహిత్ చేతికి బాల్ బలంగా తాకింది. దాంతో నొప్పిని తట్టుకోలేక రోహిత్ మైదానాన్ని వీడాడు. తర్వాత స్కానింగ్ కోసం హిట్ మ్యాన్ ని ఆసుపత్రికి తరలించారు. అయితే, రోహిత్  బదులుగా కేప్టెన్ గా జట్టుని వైస్ కేప్టెన్ రాహుల్ నడిపిస్తున్నాడు. రోహిత్ స్థానంలో రజత్ పటిదార్ ఫీల్డింగ్ కి దిగాడు. 

రెండో వన్డేలో పిచ్ పూర్తిగా బ్యాటింగ్ కి అనుకూలిస్తుంది. మొదటి ఓవర్ నుంచే భారత బౌలర్లపై దాడిచేస్తూ పరుగులు రాబట్టాలని చూసిన బంగ్లా జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన సిరాజ్ బౌలింగ్ లో మొదటి రెండు బంతుల్ని ఫోర్లుగా మలిచాడు అనముల్ హక్. అయితే, సిరాజ్ కూడా తర్వాత బంతులతో అంతే దీటుగా బదులిచ్చాడు. వరుసగా రెండు బంతుల్ని డాట్ చేసి సవాల్ విసిరాడు. నాలుగో బంతి అనముల్ బ్యాట్ కి ఎడ్జ్ తీసుకొని రెండో స్లిప్ లో ఉన్న రోహిత్ శర్మ చేతిలోకి వెళ్లినా, ఒడిసి పట్టుకోలేకపోయాడు రోహిత్. అందొచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేక పోయాడు అనముల్. సిరాజ్ వేసిన ఐదో బంతికే ఎల్బీ డబ్ల్యూగా అనముల్ (11) పెవిలియన్ చేరాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్

మీర్పూర్ వేదికగా జరుగుతున్న బంగ్లాదేశ్, భారత్ రెండో వన్డేలో టాస్ గెలిచి బ్యాటించ్ ఎంచుకుంది బంగ్లా. ఇవాళ్టి పిచ్ బ్యాటింగ్ కి అనుకూలంగా ఉండటంతో పరుగుల వరద పారే అవకాశం ఉంది. మొదటి వన్డేలో పదో వికెట్ తీయలేక పల్టీ కొట్టిన భారత్, ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ పోరులో నిలవాలనే పట్టుదలతో ఉంది.

తుది జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (సి), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (w), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్

బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI):  నజ్ముల్ హొస్సేన్ శాంటో, లిట్టన్ దాస్ (c), అనముల్ హక్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్ (wk), మహ్మదుల్లా, అఫీఫ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, నసుమ్ అహ్మద్ , ఎబాడోత్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్