బంగ్లాదేశ్ లో పద్మా నదిపై 6 కిలోమీటర్ల అతిపెద్ద బ్రిడ్జి

బంగ్లాదేశ్ లో పద్మా నదిపై 6 కిలోమీటర్ల అతిపెద్ద బ్రిడ్జి

బంగ్లాదేశ్ లో పద్మా నదిపై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బ్రిడ్జిని ఆ దేశ ప్రధాని షేక్ హసీనా శనివారం ప్రారంభించారు. 6.15 కిలోమీటర్ల పొడవున్న ఈ బ్రిడ్జి దేశంలోనే అతి పెద్దది. దేశ రాజధాని ఢాకాతో ఇతర ప్రాంతాలను కలుపుతూ నిర్మించిన ఈ బ్రిడ్జిపై రోడ్డు, రైలు మార్గాలు రెండూ ఉన్నాయి. దీన్ని రూ.28 వేల కోట్ల సొంత నిధులతో నిర్మించారు. ‘‘ఈ బ్రిడ్జి కేవలం బ్రిక్స్, సిమెంట్, ఐరన్, కాంక్రీట్ మాత్రమే కాదు.. మన దేశ గౌరవం, శక్తిసామర్థ్యాలకు ప్రతీక. ఇది బంగ్లాదేశ్ ప్రజల బ్రిడ్జి” అని షేక్ హసీనా అన్నారు. కాగా, దేశంలోనే అతిపెద్దదైన పద్మా బ్రిడ్జి ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసినందుకు బంగ్లాదేశ్ కు మన దేశం అభినందనలు తెలిపింది. ఈ మేరకు ఇండియన్ హైకమిషన్ ట్వీట్ చేసింది.