బంగ్లాదే వన్డే సిరీస్‌‌.. ఐర్లాండ్‌‌పై గెలుపు

బంగ్లాదే వన్డే సిరీస్‌‌.. ఐర్లాండ్‌‌పై గెలుపు

సిల్హెట్‌‌ (బంగ్లాదేశ్‌‌): బౌలింగ్‌‌లో పేసర్‌‌ హసన్‌‌ మహముద్‌‌ (5/32), బ్యాటింగ్‌‌లో లిటన్‌‌ దాస్‌‌ (38 బాల్స్‌‌లో 10 ఫోర్లతో 50 నాటౌట్‌‌) చెలరేగడంతో.. గురువారం జరిగిన థర్డ్‌‌ వన్డేలో బంగ్లాదేశ్‌‌ 10 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌‌పై గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌ను హోమ్‌‌ టీమ్‌‌ 2–0తో సొంతం చేసుకుంది. టాస్‌‌ గెలిచిన ఐర్లాండ్‌‌ 28.1 ఓవర్లలో 101 రన్స్‌‌కు కుప్పకూలింది.

కర్టిస్‌‌ కాంపెర్‌‌ (36) టాప్‌‌ స్కోరర్‌‌. లోర్కాన్‌‌ టకెర్‌‌ (28) ఫర్వాలేదనిపించాడు. హసన్‌‌, టస్కిన్‌‌ (3/26), ఎబాదత్‌‌ హుస్సేన్‌‌ (2/29) ధాటి కి ఐర్లాండ్‌‌ ఇన్నింగ్స్‌‌లో 9 మంది సింగిల్‌‌ డిజిట్‌‌కే పరిమితమయ్యారు. టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో బంగ్లాదేశ్‌‌ వికెట్‌‌ కోల్పోకుండా 13.1 ఓవర్లలో 102 రన్స్‌‌ చేసి నెగ్గింది. లిటన్‌‌కు తోడుగా తమీమ్‌‌ ఇక్బాల్‌‌ (41 నాటౌట్‌‌) రాణిం చాడు. హసన్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’, ముష్ఫికర్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద సిరీస్‌‌’ అవార్డులు లభించాయి.