
ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్నాయనే ప్రచారం అంతా వట్టిదేనని, ఇదంతా భారత్ తమపై చేస్తున్న తప్పుడు ప్రచారమని ఆ దేశ తాత్కాలిక ప్రధాని మహ్మద్ యూనస్ ఆరోపించారు. ఇరుగుపొరుగు దేశాల మధ్య చిన్నచిన్న సరిహద్దు వివాదాలు సహజమేనని ఆయన చెప్పారు. అయితే, వాటిని మతపరంగా చిత్రీకరించకూడదని యూనస్ అన్నారు.
హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత హిందువులపై దాడులు పెరిగాయనే ఇంటర్నేషనల్ రిపోర్టులను యూనస్ తోసిపుచ్చారు. భారత్ ఎల్లప్పుడూ ఈ విషయంలో తమపై ఒత్తిడి తెస్తుంటుంది కాబట్టి దీనిపై తాము చాలా అప్రమత్తంగా ఉన్నామని వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ అటాక్స్ పై స్పందించారు.
ఇవి అనాగరికమని అభివర్ణించారు. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు మహ్మద్ యూనస్ కౌంటరిచ్చారు. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతుందో ట్రంప్‌కు తెలుసా అని ప్రశ్నించారు. కాగా, బంగ్లాదేశ్‌లోని హిందువులు తమను తాము కేవలం హిందువులుగా కాకుండా బంగ్లాదేశ్ పౌరులుగా భావించాలని హితవు పలికారు.