అనుకోకుండా కోటీశ్వరురాలైన భార్య : మళ్ళీ అంతలోనే..

అనుకోకుండా కోటీశ్వరురాలైన భార్య : మళ్ళీ అంతలోనే..

బ్యాంక్ అధికారుల తప్పిదం వల్ల ఓ మహిళ అకౌంట్ కు భారీ ఎత్తున డబ్బు జమైంది. తన బ్యాంక్ అకౌంట్ లో పెద్దమొత్తంలో డబ్బు ఉండడంతో సదరు మహిళ ఉక్కిరి బిక్కిరైంది. బ్యాంక్ లో దాచిన డబ్బులకు ఇంట్రస్ట్ భారీగా వచ్చిందంటూ తన భర్తకు ఫోన్ చేసి చెప్పడంతో బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది.

అమెరికాలోని నార్త్ టెక్సాస్ కు చెందిన రూత్ బలూన్ అనే మహిళ షూ బిజినెస్ చేస్తోంది. మధ్యాహ్నం సమయంలో వచ్చిన మొత్తాన్ని బ్యాంక్ లో డిపాజిట్ చేసేందుకు వెళ్లింది. అదే సమయంలో సుమారు 37మిలియన్ల మొత్తం బ్యాంక్ అకౌంట్ లో జమైనట్లు ఓ మెసేజ్ వచ్చింది.

సాదారణంగా ఫారిన్ బ్యాంక్ అకౌంట్ లో దాచిన మొత్తానికి ఇంట్రస్ట్ రోజురోజుకీ మారుతుంటాయి. అలా తాను దాచిన మొత్తానికి భారీగా ఇంట్రస్ట్ వచ్చిందనుకొని తెగ సంబరపడిపోయింది. లోకల్ మీడియాకు సమాచారం అందించింది. పనిలో పనిగా తన భర్తకి ఫోన్ చేసి అసలు విషయం చెప్పింది. వచ్చిన మొత్తాన్ని సగభాగం అనాధశరణాలయాలకు, మిగిలిన మొత్తాన్ని రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలని ఉందంటూ భర్తకు వివరించింది.

భార్య ఫోన్ కాల్ తో కంగుతిన్న భర్త  హడావిడిగా బ్యాంక్ కు వెళ్లి అకౌంట్ చెక్ చేశాడు. దీంతో భారీ ఎత్తున డబ్బు జమవ్వడంతో షాక్ తిన్నాడు.

ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని, దాచి పెట్టిన చిన్నమొత్తానికి ఇంత భారీగా ఇంట్రస్ట్ ఎలా వచ్చిందంటూ బ్యాంక్ అధికారుల్ని ఆశ్రయించాడు. దీంతో బ్యాంక్ అధికారులు రోజూవారి బ్యాంక్ ట్రాన్సాక్షన్లను చెక్ చేయగా పెద్దమొత్తంలో డబ్బులు గల్లంతైనట్లు గుర్తించారు.

బ్యాంక్ ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల రూత్ బలూన్  అకౌంట్ కు భారీ మొత్తంలో ట్రాన్స్ ఫర్ అయినట్లు నిర్ధారించారు. తప్పిదంగా ట్రాన్స్ ఫర్ చేసిన మొత్తాన్ని వెనక్కి తీసుకున్న అధికారులు.. రూత్ బలూన్ దంపతుల్ని అభినందించారు.

బ్యాంక్ లో డబ్బులు జమైనా ఖర్చు చేయకుండా తమని ఆశ్రయించడం గొప్పవిషయని బ్యాంక్ అధికారులు ప్రశంసించారు.