ఆగస్ట్ నెలలో 14 రోజులు బ్యాంకులు క్లోజ్

ఆగస్ట్  నెలలో 14 రోజులు బ్యాంకులు  క్లోజ్

బ్యాంక్‌కు వెళ్లాలని యోచిస్తున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఆగస్ట్ నెలలో పండుగలు, జాతీయ సెలవులు వంటి వాటి కారణంగా బ్యాంకులు 14 రోజులు పని చేయవు. రెండు వేల రూపాయల నోట్లు మార్చుకోవడానికి గానీ, మరో పని కోసం ఈ నెలలో బ్యాంక్‌కు వెళ్లాలని మీరు అనుకుంటుంటే, బ్యాంక్‌ హాలిడేస్‌ లిస్ట్‌ను కచ్చితంగా గుర్తుంచుకోండి. ఆ లిస్ట్‌కు తగ్గట్లుగా మీ పనిని ప్లాన్‌ చేసుకోవచ్చు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెలా బ్యాంక్ ఆగస్టు నెల  సెలవుల జాబితాను విడుదల చేసింది. దేశంలోని వివిధ జోన్లలో మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఎవరైనా బ్యాంకుకు సంబంధించిన వ్యవహారాలను నిర్వహించాలనుకుంటే ఖచ్చితంగా సెలవులకు సంబంధించిన వివరాలను తెలుసుకోవాల్సిందే.. ఎవరైనా  ఖాతాను తెరవబోతున్నా లేదా బ్యాంకుకు సంబంధించిన ఏదైనా ఇతర ముఖ్యమైన పనిని చేయాలనుకున్నా ఈ సెలవుల జాబితాను పరిగణించాలి. ఆగస్టు నెలలో మొత్తం 14 రోజులు బ్యాంకులకు సెలవులు దినాలు.  రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలను అనుసారించి ప్రభుత్వ సెలవు దినాలలో అన్ని బ్యాంకులు మూసివేస్తారు. అంతేకాదు కొన్ని బ్యాంకులకు ఆయా రాష్ట్రానికి సంబంధించిన పండగలు, పర్వదినాలను సెలవులుగా ఇస్తారు.

2023 ఆగస్టు నెలలో బ్యాంకుల సెలవు రోజులు:

  • ఆగస్టు 06 : ఆదివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
  • ఆగస్టు 08:  మంగళవారం - (టెండోంగ్ లో రమ్ ఫాత్): సిక్కింలో బ్యాంక్ సెలవు
  • ఆగస్టు 12:  రెండో శనివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
  • ఆగస్టు 13:  ఆదివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
  • ఆగస్టు 15 : మంగళవారం - (స్వాతంత్ర్య దినోత్సవం): దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
  • ఆగస్టు 16 : బుధవారం - (పార్సీ నూతన సంవత్సరం- షాహెన్‌షాహి): బేలాపూర్, ముంబై, నాగ్‌పుర్‌లలో బ్యాంకులకు సెలవు
  • ఆగస్టు 18: శుక్రవారం - (శ్రీమంత శంకరదేవుని తిథి): గువాహతిలో బ్యాంకులకు సెలవు
  • ఆగస్టు 20 : ఆదివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
  • ఆగస్టు 26 : నాలుగో శనివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
  • ఆగస్టు 27:  ఆదివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
  • ఆగస్టు 28 : సోమవారం - (మొదటి ఓనం): కోచి, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు
  • ఆగస్టు 29:  మంగళవారం - (తిరువోణం): కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు
  • ఆగస్టు 30 : బుధవారం - (రాఖీ పండుగ): జైపూర్, సిమ్లాలో బ్యాంకులకు సెలవు
  • ఆగస్టు 31:  గురువారం - (రాఖీ పండుగ/శ్రీనారాయణ గురు జయంతి/పాంగ్-లాబ్సోల్): డెహ్రాడూన్, గాంగ్‌టక్, కాన్పూర్, కొచ్చి, లఖ్‌నవూ, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు  

బ్యాంకు సెలవు రోజుల్లో నగదు లావాదేవీలు ఎలా?        

RBI, బ్యాంక్‌ సెలవులను మూడు కేటగిరీల కింద వర్గీకరించింది. హాలిడేస్‌ అండర్‌ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, రియల్-టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడేస్ & 'క్లోజింగ్‌ ఆఫ్‌ అకౌంట్స్‌. ఏ బ్యాంక్‌ సెలవైనా ఈ మూడు కేటగిరీల్లో ఒకదాని కిందకు వస్తుంది. బ్యాంకులకు సెలవు రోజుల్లోనూ ఆన్‌లైన్ & నెట్ బ్యాంకింగ్, UPI, ATM సేవలు 24 గంటలూ పని చేస్తాయి. బ్యాంకు సెలవుల్లో నగదు విత్‌డ్రా.. డిపాజిట్‌ చేయాల్సివస్తే ATMను ఉపయోగించవచ్చు. ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయడానికి మొబైల్ బ్యాంకింగ్ లేదా నెట్ బ్యాంకింగ్‌ లేదా UPIని ఉపయోగించవచ్చు.