మామూలోడు కాదు..నకిలీ పత్రాలతో పనిచేసే బ్యాంకులోనే రూ.73 లక్షల లోన్ తీసుకున్న మేనేజర్

మామూలోడు కాదు..నకిలీ పత్రాలతో  పనిచేసే బ్యాంకులోనే రూ.73 లక్షల లోన్ తీసుకున్న మేనేజర్
  •     ఆఫీసర్ల తనిఖీలో బయటపడ్డ బ్యాంక్  మేనేజర్  నిర్వాకం


ధర్మసాగర్, వెలుగు: నకిలీ పత్రాలు సృష్టించి తాను పని చేసే బ్యాంక్​లో రూ.73 లక్షల లోన్​ తీసుకున్న బ్యాంక్​ మేనేజర్​ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ధర్మసాగర్​ సీఐ ప్రవీణ్  కుమార్  తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా ధర్మసాగర్  మండలం ముప్పారం గ్రామంలోని యూనియన్  బ్యాంక్  మేనేజర్  ఆర్కల సురేశ్..​ తన బంధువుల పేరు మీద అదే బ్రాంచ్​లో అకౌంట్  ఓపెన్  చేశాడు. 

ఆ తరువాత బంగారు ఆభరణాలు తనఖా పెట్టకుండానే నకిలీ పత్రాలు సృష్టించి సుమారు రూ.73 లక్షలు గోల్డ్ లోన్  తీసుకున్నాడు. అధికారులు తనిఖీ చేయగా మేనేజర్  సురేశ్​ అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. గతంలోనూ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో, వాటిపై బ్యాంకు ఉన్నతాధికారులు ఎంక్వైరీ చేస్తున్నట్లు సమాచారం.